బాలయ్య గుమ్మడికాయ, కొబ్బరికాయ ఒకేసారి కొట్టనున్నాడు  

Balakrishna Ready For Boyapati Movie-balakrishna Nandamuri

నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం ‘రూలర్‌’ విడుదలకు సిద్దం అవుతోంది.వచ్చే నెల 20న విడుదల కాబోతున్న రూలర్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి కాబోతుంది.ఈనెలాకరు వరుకు సినిమాకు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు.రూలర్‌కు గుమ్మడి కాయ కొట్టిన వెంటనే తన తదుపరి చిత్రంకు బాలయ్య కొబ్బరి కాయ కొట్టేందుకు సిద్దం అవుతున్నాడు.బోయపాటి శ్రీను దర్శకత్వంలో 106వ చిత్రాన్ని బాలయ్య చేస్తున్న విషయం తెల్సిందే.ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యింది.

Balakrishna Ready For Boyapati Movie-balakrishna Nandamuri Telugu Tollywood Movie Cinema Film Latest News Balakrishna Ready For Boyapati Movie-balakrishna Nandamuri-Balakrishna Ready For Boyapati Movie-Balakrishna Nandamuri

వినయ విధేయ రామ చిత్రం తర్వాత బోయపాటి చాలా గ్యాప్‌ తీసుకుని ఈ చిత్రాన్ని చేస్తున్నాడు.ఆ చిత్రంతో బోయపాటి క్రేజ్‌ బాగా దెబ్బ తిన్నది.మెగా ఫ్యాన్స్‌ బోయపాటిని ఒక రేంజ్‌లో ఆడుకున్నారు.ఆ సినిమాలో యాక్షన్‌ మరీ ఓవర్‌ యాక్షన్‌ అయ్యింది అంటూ కామెంట్స్‌ వినిపించాయి.

అన్ని వర్గాల వారికి బాబోయ్‌ అనిపించేలా ఆ సినిమా నిలిచింది.వినయ విధేయ రామ చిత్రం తర్వాత బోయపాటితో వర్క్‌ చేసేందుకు దాదాపు అందరు హీరోలు బాబోయ్‌ నీకో దండం అంటూ చెప్పి దూరంగా వెళ్లి పోయారు.

తనకు గతంలో సింహా మరియు లెజెండ్‌ వంటి హిట్‌ చిత్రాలను ఇచ్చిన కారణంగా బోయపాటితో వర్క్‌కు బాలయ్య ఓకే చెప్పాడు.బాలకృష్ణ రూలర్‌ చిత్రం కేవలం మూడు నాలుగు నెలల్లోనే పూర్తి అయ్యింది.

అలాగే 106వ చిత్రంను కూడా చాలా స్పీడ్‌గా పూర్తి చేసి వచ్చే వేసవి లేదంటే దసరాకు సినిమాను విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నాడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ మరియు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.