బాలకృష్ణ మొండితనం.. ఆ కారు పంపిస్తేనే 'షూటింగ్'కి.. లేదంటే?

నందమూరి బాలకృష్ణ.ఈ పేరుకు ఎంత పవర్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Balakrishna Put Conditions On That Movie Shooting-TeluguStop.com

బాలయ్య పేరు చెప్తే చాలు మా బాలయ్య బాబు అంటూ వస్తారు.ఇటు రాజకీయాల్లోనూ అటు సినిమాల్లోనూ రెండు చోట్లా బాలయ్య ఫుల్ జోష్ తో ముందుకు సాగిపోతున్నాడు.

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న బాలయ్య ఎంత మొండివాడు అనేది ఎవరికి తెలియదు.నిజానికి ఇప్పుడు కూడా బాలయ్య ఏది అనుకుంటే అది చేస్తాడు లెండి.

 Balakrishna Put Conditions On That Movie Shooting-బాలకృష్ణ మొండితనం.. ఆ కారు పంపిస్తేనే షూటింగ్’కి.. లేదంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అది వేరే విషయం.

ఏ కారు పంపిస్తే షూటింగ్ కి వస్తా అన్నారు అంటే.

అప్పట్లో బాలయ్య బాబు రౌడీ ఇన్‌స్పెక్టర్‌ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యింది అనేది చెప్పాల్సిన పని లేదు.మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న చిత్రం అది.పోలీసులా నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సినిమా అది.ఆ సినిమా దర్శకుడు బి.గోపాల్.ఈ రౌడీ ఇన్‌స్పెక్టర్‌ తియ్యడానికి బాలయ్య ఓ కండిషన్ పెట్టాడట.

ఆ కండిషన్ గురించి తెలిస్తే ఎవరైనా సరే ఏంటి బాలయ్య ఇంత మొండివాడు అని అంటారు అంతేకాదు బాలయ్య బాబుకు నటన అంటే ఎంత ఇష్టం అని కూడా అంటారు.

అంతగా ఏమైందంటే? బాలయ్య బాబు ఆ సినిమాలో పోలీస్ లా నటించేందుకు మాములు సమయంలో కూడా పోలీస్ ఎలా మాట్లాడుతాడు? పోలీస్ ఎలా నడుస్తాడు? అనేవి ప్రాక్టీస్ చేసేవాడట.ఇప్పుడు కూడా అలానే బాలయ్య బాబు ఆ సినిమాలో వాడిన జీపులో ఎలా కూర్చుంటారు? అనేది కూడా అలవాటు చేసుకునేందుకు సినిమాలో వాడిన జీపు పంపించాలని లేదంటే షూటింగ్ కి రాను అని బాలయ్య బాబు డైరెక్టర్ కి ఫోన్ చేసి చెప్పాడట.దీంతో బాలయ్య బాబుకు షూటింగ్ లో ఉపయోగించిన పోలీసు జీపు పంపించారట.

అప్పుడు దర్శకుడుకి అర్థమయ్యిందట.నటన అంటే బాలయ్యకు ఎంత ఇష్టం అనేది.

ఏది ఏమైనా బాలయ్య బాబు నటన కోసం మొండిగా కాదు జగమొండిగా అయినా మారగలడు.

#Car #Role #Rowdy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు