బాలయ్య ప్రెస్‌మీట్ తో అఖండ బయ్యర్ల టెన్షన్‌

నందమూరి బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందిన అఖండ సినిమా డిసెంబర్ 2న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన రెండు సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా ఖచ్చితంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

 Balakrishna Press Meet About Cbn Crying Akhanda Movie Business Effect Details, A-TeluguStop.com

అఖండ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయిన సమయం లోనే హ్యాట్రిక్ ఖాయం అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.బాలయ్యకు ఆంద్రా సీడెడ్ లో బలమైన మార్కెట్ ఉంది.

అక్కడ భారీ ఎత్తున ఈయన సినిమాలు వసూళ్లను దక్కించుకున్న సందర్బాలు చాలానే ఉన్నాయి.అఖండ సినిమా కూడా అక్కడ భారీ ఎత్తున విడుదల చేసి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ను దక్కించుకునేందుకు మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.

అయితే కరోనా వల్ల పరిస్థితులు మునుపటిలా లేవు.అలాగే ఏపీలో టికెట్ల రేట్లు మరీ తక్కువగా ఉన్నాయి.

దాంతో వసూళ్లు అనుకున్నదానికి కనీసం 60 నుండి 70 శాతం అయినా వస్తాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సమయంలోనే బాలయ్య తాజా ప్రెస్ మీట్‌ వివాదాస్పదం అయ్యింది.

బాలకృష్ణ మాట్లాడుతూ తన సోదరి భువనేశ్వరిని అన్న మాటలపై చాలా సీరియస్ గా స్పందించాడు.

Telugu Akhanda, Akhanda Buyers, Andhrapradesh, Ap, Ap Ticket Rates, Bhuvaneshwar

ప్రభుత్వం లో ఉన్న వారిని తీవ్ర పదజాలంతో హెచ్చరించాడు.ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వంతో పెట్టుకుంటే వారి సినిమాలు ఏమవుతాయో ఇప్పటికే చూశాం.కనుక అఖండ సినిమాకు ఏపీలో భారీ డ్యామేజీ జరుగవచ్చు అనే టాక్‌ వినిపిస్తుంది.

అఖండ సినిమా ప్రత్యేక షో లు మొదలుకుని ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం నుండి సానుకూలం కాకుండా వ్యతిరేకంగా నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.అదే కనుక జరిగితే నష్టపోతామని బయ్యర్లు టెన్షన్‌ పడుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube