ప్రభాస్‌కు చుక్కలు చూపిస్తోన్న బాలయ్య  

Balakrishna Targets Prabhas In Both Ways, Balakrishna, Prabhas, BB3, Superman, Tollywood News - Telugu Balakrishna, Bb3, Prabhas, Superman, Tollywood News

నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి తనదైన మార్క్‌తో రూపొందిస్తుండగా, ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.

 Balakrishna Prabhas Bb3

ఇక ఇందులో ఒకటి అఘోరా పాత్ర కాగా మరొకటి రైతు పాత్రగా తెలుస్తోంది.కాగా ఈ సినిమాతో బాలయ్య యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను పూర్తిగా టార్గె్ట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ఈ సినిమాకు ప్రస్తుతానికి ‘BB’ అనే టైటిల్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు బాలయ్య అండ్ టీమ్.కాగా ప్రభాస్ నటించిన విజువల్ వండర్ చిత్రం బాహుబలి కూడా అదే పేరుతో జనాలకు దగ్గరయ్యింది.

ప్రభాస్‌కు చుక్కలు చూపిస్తోన్న బాలయ్య-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక బాలయ్య సినిమాకు సూపర్‌మ్యాన్ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ టైటిల్ అయితే బాలయ్య సినిమాకు బాగా కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అటు ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాన్ని సూపర్‌మ్యాన్ తరహా పాత్రలో నటిస్తుండటంతో బాలయ్య సినిమాకు ప్రభాస్ సినిమాకు తేడా ఏమిటో తెలియడం లేదని ప్రేక్షకులు వాపోతున్నారు.

మొత్తానికి సినిమా రిలీజ్‌కు ముందే బాలయ్య ఇలా ప్రభాస్‌ను టచ్ చేస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

తమ అభిమాన హీరో సినిమాలను బాలయ్య టార్గెట్ చేస్తుండటం ఏమాత్రం బాగాలేదని వారు అంటున్నారు.ఇక బాలయ్య నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఓ సరికొత్త బ్యూటీ నటిస్తుండగా మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

#Prabhas #Balakrishna #Superman #BB3

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Balakrishna Prabhas Bb3 Related Telugu News,Photos/Pics,Images..