బాలుడిని పరామర్శించిన బాలయ్య.. వైరల్ ఫోన్ రికార్డ్?

Balakrishna Phonecall To His Fan Family

నందమూరి బాలకృష్ణ అంటే ఆయనకు కోపం ఎక్కువ, కోపం వస్తే కొడతారు అని చెపుతారు.ఇవన్నీ ఒక వైపే.

 Balakrishna Phonecall To His Fan Family-TeluguStop.com

నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్టు ప్రతీ ఒక్కరికీ రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి.అలాగే బాలకృష్ణ గారికి కూడా.

షూటింగ్స్ లోనూ ఆయన అందరితోనూ చాల మర్యాదగా నడుచుకుంటారనే పేరు ఇప్పటికే ఉంది.ఇక అభిమానులకు ఏమైనా జరిగితే స్పందించేటందుకు కూడా ఆయన ముందు ఉంటారని ఈ మధ్య కాలంలో వైరల్ అవుతున్న ఒక ఫోన్ కాల్ సంభాషణ తెలియజేస్తుంది.

 Balakrishna Phonecall To His Fan Family-బాలుడిని పరామర్శించిన బాలయ్య.. వైరల్ ఫోన్ రికార్డ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గోడ మీద నుంచి కింద పడిన ఒక బాలుడిని నందమూరి బాలకృష్ణ ఫోన్ చేసి మరీ పరామర్శించిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక వివరాల్లోకి వెళితే, ఒక అభిమాని కుమారునికి ఆరోగ్య బాగా లేదని తెలిసి స్వయంగా బాలకృష్ణనే వాళ్ళకి ఫోన్ చేసి వారి మంచి, చెడులను ఆరా తీశారు.

ఒక బాలునికి ఆడుకుంటుండగా కింద పడి చేయి విరిగగా అతని తండ్రికి ఫోన్ చేసి, ఆ బాలుని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Telugu Balakrishna, Balaya Fan Injured, Balayya Phone Call To Fan, Kind Hearted, Nandamuri Balakrishna, Phone Call, Tollywood, Viral Phone Record-Movie

అంతే కాకుండా ఆ బాలునితో కూడా మాట్లాడి జాగ్రత్తగా ఉండమని సలహాలు, సూచనలు చేశారు బాలకృష్ణ.ఫోన్ కాల్ సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.దీంతో బాలకృష్ణ దయా గుణాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

కొన్ని విషయాలలో ఎంతో కటువుగా గంభీరంగా కనిపించే బాలయ్య బాబు మరి కొన్ని విషయాలలో తన దయాగుణాన్ని బయటపెడతారని చెప్పవచ్చు

#Phone #Kind #Balakrishna #Balaya Fan #Phone

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube