రోజాకు ఫోన్ చేసిన బాలకృష్ణ.. అసలేమైందంటే..?

బాలకృష్ణ, రోజా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమాలలో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయనే సంగతి తెలిసిందే.రాజకీయాల పరంగా రోజా, బాలకృష్ణ వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ఒకరిపై మరొకరు ఎప్పుడూ విమర్శలు చేసుకోలేదు.

 Balakrishna Phone Call  To Roja About Health, Balakrishna ,mla Roja, Phone Cal,-TeluguStop.com

రోజా నగరి వైసీపీ ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తూనే ఏపీఐఐసీ ఛైర్మన్ గా బిజీగా ఉండటంతో పాటు జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.

కొన్ని రోజుల క్రితం చెన్నైలో రోజా రెండు ఆపరేషన్లు చేయించుకున్నారు.రోజా చేయించుకున్న ఆపరేషన్లు మేజర్ ఆపరేషన్లు కావడంతో ఇండస్ట్రీ వర్గాలకు చెందిన వాళ్లతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం రోజాను పరామర్శిస్తున్నారు.

స్టార్ హీరో బాలకృష్ణ రోజాకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.రాజకీయ విభేదాలను పక్కన పెట్టి రోజాకు బాలయ్య ఫోన్ చేయడం గమనార్హం.

Telugu Balakrishna, Mla Roja, Phone, Roja-Movie

ఫోన్ లో బాలకృష్ణ రోజా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారని సమాచారం.మరోవైపు బాలకృష్ణ ఒకవైపు నియోజకవర్గానికి తగినంత సమయం కేటాయిస్తూనే రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు.బాలకృష్ణ బోయపాటి శ్రీను టైటిల్ కు సంబంధించి ఉగాది పండుగకు ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాకు టైటిల్ సంస్కృత పదంతో ఉండబోతుందని సమాచారం.

గతంలో మోనార్క్, గాఢ్ ఫాదర్ అనే టైటిల్స్ వినిపించినా ఆ టైటిల్స్ పై బాలకృష్ణ పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.ఈ మధ్య కాలంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ లేని బాలకృష్ణ బోయపాటి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ తో పాటు పూర్ణ నటిస్తున్నారు.వినయ విధేయ రామ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube