కొవాగ్జిన్ వ్యాక్సిన్ పై బాలకృష్ణ వ్యాఖ్యలు ఏంటంటే.. ?

ప్రపంచ దేశాలను చిగురుటాకుల వణికించిన కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ ఇంత త్వరగా రావడం, అంతే వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుండటంతో ఎందరో ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 Balakrishna, Corona Vaccine, Covaxin, Basavatarakam, Cancer Hospital-TeluguStop.com

కాగా తాజాగా ఈ రోజు హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన రిపబ్లిక్ డే వేడుక ల్లో చైర్మన్ హోదాలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ జాతీయ పతాకం ఎగురవేసిన అనంతరం దేశీయంగా రూపొందించిన కొవాగ్జిన్ పై స్పందించారు.

అన్ని దేశాల్లో కరోనా భీభత్సం సృష్టించిదని ఇలాంటి సమయంలో ఎన్నో దేశాలు కోవిడ్ 19కు మందు కనుగొనడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయగా మనదేశం మాత్రం ఆ కలను నిజం చేయడం భారతీయులందరికి గర్వకారణం అన్నారు.

అంతే కాకుండా మనదేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇతర దేశాల్లోని ప్రజలకు ఉపయోగపడడం హర్షించదగ్గ విషయం అని పేర్కొన్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అద్భుతంగా సాగుతోందని కొనియాడుతూ, కరోనా కారణంగా మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు బాలయ్య.అదీగాక బసవతారకం ఆసుపత్రిలో ఉన్న క్యాన్సర్ బాధిత చిన్నారులకు పండ్లు అందజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube