అదే బాలకృష్ణ! ఈ సారి స్టేజి మారింది అంతే  

మరో సారి అభిమానిని పరిగెత్తించి కొట్టిన బాలకృష్ణ. .

Balakrishna Once Again Attack On Fan In Chipurupalli-

బాలకృష్ణ అంటే ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసిన అందరికి ఒకటే భయం పట్టుకుంది.ఏపీలో బాలకృష్ణని విపరీతంగా అభిమానించే వారు ఉన్నారు.అయితే వారంతా బాలకృష్ణ తమ ప్రాంతానికి వచ్చాడు కదా అని ఆశతో వెళ్లి అతనితో కరచాలనం చేయడానికి సాహసిస్తే అతని చేతిలో ఎక్కడ తన్నులు తినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు..

Balakrishna Once Again Attack On Fan In Chipurupalli--Balakrishna Once Again Attack On Fan In Chipurupalli-

పబ్లిక్ మీటింగ్ లో అయిన, ఎక్కడ అయిన అభిమానుల వలన తనకి ఎ మాత్రం అసహనం అనిపించినా ఏ మాత్రం ఆలోచించకుండా వారిపై చేయి చేసుకోవడం బాలకృష్ణ నైజంగా మారిపోయింది.

ఈ మధ్య కాలంలో తరుచుగా బాలకృష్ణ ఇలాంటి సంఘటనతో పాపులర్ అవుతున్నారు.బాలకృష్ణ పక్కన ఉంటే దెబ్బలు తినడానికి రెడీగా ఉండాలి అన్నట్లు ఇప్పుడు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటున్నారు.

ఆ మధ్య సినిమా షూటింగ్ సెట్ లో తన అసిస్టెంట్ పై చేయి చేసుకున్న బాలకృష్ణ తరువాత ఓ చోట తన అభిమానిని లాగి పెట్టి కొట్టాడు.ఆ టైంలో బాలకృష్ణ చెంప దెబ్బ ఘటనలు సంచలనంగా మారాయి.

ఇక తాజాగా ఎన్నికల నేపధ్యంలో హిందూపురంలో ఓ జర్నలిస్ట్ మీద బాలకృష్ణ చేయి చేసుకొని క్షమాపణ కూడా చెప్పాడు.ఇదిలా ఉంటే తాజాగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి తరుపున బాలయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.

ఈ ప్రచారంలో ఓ అభిమానిని పరిగెత్తించి మరి బాలయ్య దాడి చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియోలో ఉన్నదీ బాలయ్య కాదని, అతని మీద నెగిటివ్ పబ్లిసిటీ చేయడానికి ఎవరో బాలయ్య గెటప్ లో ఉండి దాడి చేయించారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.