ఈసారి బాబాయి పుట్టిన రోజు వేడుకకు అబ్బాయి  

Balakrishna Ntr Chiranjeevi - Telugu Balakrishna, Balakrishna Birthday, Chiranjeevi, Coronavirus, Lock Down, Mega Family, Nandamuri Family, Nandamuri Kalyan Ram, Ntr

ప్రతి ఒక్కరి జీవితంలో కూడా 60వ పుట్టిన రోజుకు చాలా ప్రత్యేకత ఉంటుంది.60వ పుట్టిన రోజును షష్టిపూర్తిగా జరుపుకుంటూ ఉంటారు.ఈనెల 10వ తారీకున నందమూరి బాలకృష్ణ తన 60వ పుట్టిన రోజును అంటే షష్టిపూర్తిని జరుపుకోబోతున్నాడు.చిరంజీవి షష్టిపూర్తి సందర్బంగా మెగా ఫ్యాన్స్‌ వేడుకలు భారీగా నిర్వహించారు.

 Balakrishna Ntr Chiranjeevi

దాదాపు వారం రోజుల పాటు వరుస వేడుకలు నిర్వహించి మెగా పండుగ చేసుకున్నారు.ఆ సమయంలో మెగా హీరోలు అంతా ఏకతాటిపైకి వచ్చి చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.

ఇక బాలకృష్ణ షష్టిపూర్తి వేడుకలను కూడా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ వేడుకలకు ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరు అయ్యే అవకాశం ఉందంటున్నారు.కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమలు ఉండి సమూహాలకు సమావేశాలకు అనుమతులు ఇవ్వని కారణంగా కాస్త విభిన్నంగా జనాలు లేకుండా ఫ్యాన్స్‌ హడావుడి లేకుండా బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను చాలా ప్రైవేట్‌ కార్యక్రమంగా నిర్వహించి లైవ్‌ ఇవ్వాలని భావిస్తున్నారు.

ఈసారి బాబాయి పుట్టిన రోజు వేడుకకు అబ్బాయి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

బాలకృష్ణ ఇంట్లో లేదంటే మరెక్కడైనా జరిగే కార్యక్రమంలో ఎన్టీఆర్‌ పాల్గొనడం అయితే ఖాయం అని అంటున్నారు.నందమూరి కళ్యాణ్‌ రామ్‌ వీరిద్దరిని ఒకే స్టేజ్‌పైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇక బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ గా ఒక వీడియోను విడుదల చేయాలని కూడా భావిస్తున్నారు.ఆ వీడియో ఏంటీ అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

కాని ఎన్టీఆర్‌, బాలయ్యలు మాత్రం ఒక్క స్టేజీపైకి రావడం కన్ఫర్మ్‌ అయ్యింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Balakrishna Ntr Chiranjeevi Related Telugu News,Photos/Pics,Images..

footer-test