ఆ వివాదానికి శుభం కార్డు ? బాలయ్య ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ ?  

Balakrishna Invite The Chiranjeevi On His Birthday, Balakrishna, Chiranjeevi, Balakrishna Birthday, JR. NTR, Telangana CM KCR, Talasani Srinivas Yadav - Telugu Balakrishna, Balakrishna Birthday, Chiranjeevi, Jr Ntr, Talasani Srinivas Yadav, Telangana Cm Kcr

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ మధ్య కొద్ది రోజుల క్రితం మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర స్థాయికి చేరడం, ఈ వివాదం పై చిరు బాలయ్య వర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు చేసుకోవడం, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఈ వివాదం చేసేందుకు ప్రయత్నించడం వంటి పరిణామాలు ఎన్నో జరిగాయి కొద్ది రోజులుగా.ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆధిపత్య పోరు నడుస్తోంది అని, హీరోల మధ్య ఇగో ప్రాబ్లమ్స్ తీవ్రస్థాయికి వెళ్ళిపోయాయి అని, ఇలా ఎన్నో రకాల కథనాలు జనాల్లో ప్రచారం అయ్యాయి.

 Balakrishna Ntr Chiranjeevi

ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లను కొంత మంది మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోని సినీ ప్రముఖులు కలవడం అసంతృప్తికి కారణమైంది.

ఇదిలా ఉంటే ఈ అగ్ర హీరోల మధ్య వివాదం ముదిరే కానీ, తగ్గేది కాదు అనే సంకేతాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదలయ్యింది.ఇది ఇండస్ట్రీ భవిష్యత్తు దృష్ట్యా, అంత మంచిది కాదని, ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమయంలో వివాదాలు మంచిది కాదనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అయ్యింది.దీంతో రెండు వర్గాలు ఈ సమస్యను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేశాయి.

ఆ వివాదానికి శుభం కార్డు బాలయ్య ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దానిలో భాగంగానే ఈనెల 10వ తేదీ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు, షష్టిపూర్తి కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా బాలయ్య మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఈ ఫంక్షన్ కు హాజరయ్యేందు చిరు కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.ఈ సందర్భంగా ఈ ఇద్దరు ఒకే స్టేజి పై అనేక అంశాలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని, తామంతా ఒక్కటేనంటూ సంకేతాలు ఇచ్చే విధంగా వీరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

అలాగే బాలయ్య ఇంట జరిగే ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించబోతున్నాడట .ఈ ఫంక్షన్ కు అతి కొద్ది మంది సన్నిహితులు బంధువులు మాత్రమే పిలవాలని నిర్ణయించుకున్నారు.ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు అమలు లో ఉండడంతో అతి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు అందాయట.మరి ఈ ఫంక్షన్ లో చిరు బాలయ్య ఏ సందేశం ఇస్తారో అని అందరూ ఆశక్తి గా ఎదురు చూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు