బాలయ్య ‘ఎన్టీఆర్‌’ మూవీకి పెద్ద సమస్య.. అది క్రిష్‌ వల్లే     2018-07-22   13:00:48  IST  Ramesh Palla

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం ఇటీవలే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. నందమూరి తారక రామారావు బయోపిక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ విద్యాబాలన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయిలో ఈ చిత్రం అన్ని ఏరియాల్లో అమ్ముడు పోతూ అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. బాలకృష్ణ ఈ చిత్రంను సొంతంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

క్రిష్‌ దర్శకత్వం బాలకృష్ణ ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఎన్టీఆర్‌ చిత్రానికి ముందు క్రిష్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌లో ‘మణికర్ణిక’ చిత్రం రూపొందింది. జాన్సి లక్ష్మి రాణి జీవిత కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మణికర్ణిక చిత్రాన్ని విడుదల చేయాల్సి ఉంది. కాని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఆలస్యం అవుతున్న కారణంగా చిత్రాన్ని ఏకంగా వచ్చే ఏడాది జనవరికి విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు.

Balakrishna Ntr Biopic Facing Big Problem-

Balakrishna Ntr Biopic Facing Big Problem

వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో ‘మణికర్ణిక’ చిత్రాన్ని విడుదల చేయబోతున్న కారణంగా ఇప్పుడు బాలకృష్ణలో టెన్షన్‌ ప్రారంభం అయ్యింది. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం కూడా జనవరిలో విడుద కావడం వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, తెలుగులో మణికర్ణికపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలతో తెలుగులో కూడా ఆచిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తారు. అదే జరిగితే తన ఎన్టీఆర్‌ చిత్రం కంటే ఆ చిత్రానికే కాస్త ఎక్కువ ప్రాముఖ్యతను సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఇస్తారేమో అని భావిస్తున్నారు.

రెండు చిత్రాల మద్య రెండు వారాల గ్యాప్‌ వస్తుంది కనుక ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ కొందరు అంటున్నారు. కాని భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్న బాలకృష్ణకు మాత్రం కాస్త టెన్షన్‌గా ఉంది. ఇతర సినిమాలతో పోటీ అంటే ఏమో కాని, తన సినిమాకు దర్శకత్వం చేస్తున్న క్రిష్‌తోనే సమస్య అంటే అంతకు మించిన ఇబ్బంది మరేం ఉండదు. ఈ సమస్య నుండి బాలయ్య ఎలా బయట పడతాడో చూడాలి.