ఆ ఒక్క విషయంలో దర్శకుడు బోయపాటితో విభేదిస్తున్న బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.ఆ రెండు కూడా బాలయ్య కెరీర్ లో నిలిచి పోయే సక్సెస్‌ లుగా నిలిచాయి.

 Balakrishna Not Intrested In Monark Tittle , Balakrishna, Boyapati Srinu, Monark-TeluguStop.com

ముఖ్యంగా సింహా సినిమా అప్పట్లో ఓ రేంజ్‌ లో ఆడింది అనడంలో సందేహం లేదు.సింహా మరియు లెజెండ్‌ సినిమా తరహాలో ఇప్పుడు మరో యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ ను బాలయ్యతో బోయపాటి శ్రీను చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

బాలయ్య అత్యంత ప్రత్యేకంగా ఈ సినిమాలో కనిపిస్తాడని మొదటి నుండి చెబుతూ వస్తున్నారు.ఇక ఈ సినిమా టైటిల్‌ విషయం గతంలో ఎప్పుడు లేనంతగా గందరగోళంగా ఉంది.

ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ గురించిన చర్చ జోరుగా సాగుతోంది.

మొదట ఈ సినిమాకు సూపర్‌ మ్యాన్‌ అనే టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరిగింది.

ఈ సినిమా కు మోనార్క్‌ అనే టైటిల్‌ ను బోయపాటి అనుకుంటున్నాడనే వార్తలు ఎక్కువ కాలంగా వచ్చాయి.ఇటీవల మరి కొన్ని టైటిల్స్ కూడా ప్రచారం జరిగినా కూడా చివరకు మోనార్క్‌ టైటిల్‌ పైనే బోయపాటి దృష్టి పెట్టాడు అంటున్నారు.

కాని మోనార్క్‌ టైటిల్‌ విషయంలో బాలయ్య ఆసక్తి గా లేడు అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.మోనార్క్‌ టైటిల్‌ కాకుండా మరేదైనా మంచి టైటిల్ ను పరిశీలించాల్సిందిగా బోయపాటికి బాలయ్య సూచించాడట.

సినిమాకు సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా బాలయ్య నో అనలేదు.కాని మొదటి సారి టైటిల్‌ విషయమై ఆయన నో అన్నట్లుగా సమాచారం అందుతోంది.మొత్తానికి ఈ విషయమై ముందు ముందు ఇద్దరి మద్య గొడవ పెద్దది అయ్యేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.బాలయ్య అభిమానులు మాత్రం మోనార్క్‌ కు కూడా ఓకే అంటున్నారు.

సినిమా విడుదల తేదీ ఇప్పటికే ప్రకటించిన కారణంగా ఒకటి రెండు వారాల్లోనే టైటిల్‌ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube