ఆయనకే ఓటేసిన బాలయ్య.. సీనియర్‌ను పక్కన్నబెట్టాడట!  

Balakrishna Next Movie With Puri Not B Gopal - Telugu B Gopal, Balakrishna, Boyapati Srinu, Puri Jagannadh

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే అఫీషియల్‌గా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలొనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

 Balakrishna Next Movie With Puri Not B Gopal

ఈ సినిమాతో బాలయ్య మరోసారి తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతోంది.గతంలో బాలయ్యకు సింహా, లెజెండ్ తరహా సక్సెస్‌ను మరోసారి ఈ సినిమాతో అందించేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలోనే సీనియర్ డైరెక్టర్ బి.

ఆయనకే ఓటేసిన బాలయ్య.. సీనియర్‌ను పక్కన్నబెట్టాడట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గోపాల్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు బాలయ్య ఆసక్తి చూపుతున్నాడు.ఈ కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్‌లుగా నిలవడంతో, మరోసారి బి.గోపాల్‌తో బాలయ్య సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని వార్తలు వినిపించాయి.అయితే తాజా సమాచారం ప్రకారం బి.

గోపాల్ చిత్రాన్ని బాలయ్య వాయిదా వేసినట్లు తెలుస్తోంది.ఆయన చెప్పిన కథలో భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఉందని బాలయ్య సూచించినట్లు తెలుస్తోంది.

దీంతో బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు ఫిలిం నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే పూరీ బాలయ్యకు ఓ కథను వినిపించగా, బాలయ్య ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా బోయపాటితో సినిమా ముగిసిన తరువాత బాలయ్య పూరీ కాంబోలో సినిమా రానుంది.అయితే గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘పైసా వసూల్’ అదిరిపోయే క్రేజ్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

మరి ఇప్పుడు వీరి కాంబోలో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test