బాలయ్య మాస్ కు తగ్గట్లు మళ్లీ రీ రికార్డింగ్ బద్దలు కొట్టేస్తున్నాడట

నందమూరి బాలకృష్ణ 107 మూవీ షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.ఒకటి రెండు షెడ్యూల్స్ లో సినిమా పూర్తి అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

 Balakrishna New Movie Nbk 107 Movie Music Ss Thaman , Balakrishna , Balayya , Film News , Gopichand Malineni , Nbk107 , News In Telugu , Ss Thaman-TeluguStop.com

అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా ను దసరా కు విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న బాలయ్య సినిమా కు థమన్‌ మ్యూజిక్ కు అందిస్తున్న విషయం తెల్సిందే.

ప్రస్తుతం సినిమా కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.బాలయ్య గత చిత్రం అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా సాధించిన విజయం లో థమన్ అందించిన మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది.ముఖ్యం గా థమన్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ కు థియేటర్ లు బ్లాస్ అయ్యేంతగా స్పీకర్ లు బద్దలు అయ్యేంతగా రీసౌండ్ వచ్చింది.

అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అఖండ కు ఏ మాత్రం తగ్గకుండా బాలయ్య 107 సినిమా కు కూడా రీ రికార్డింగ్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

బాలయ్య కు తగ్గట్లుగా మాస్ బ్లాక్ బస్టర్ రికార్డింగ్‌ ను… బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ను థమన్ ఇవ్వబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు.

తాజాగా థమన్ తో వర్క్ చేస్తున్నట్లుగా ఈ ఫోటో ను షేర్‌ చేయడం జరిగింది.దాంతో రికార్డు లు మళ్లీ బద్దలు అవ్వడం ఖాయం.ఖచ్చితం గా ఈ సారి కూడా స్పీకర్ లు బద్దలు అవ్వడం ఖాయం అంటూ అంతా కూడా ఆసక్తి గా ఉన్నారు.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన షూటింగ్ చివరి దశ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

షూటింగ్‌ ముగిసిన వెంటనే బాలయ్య తన తదుపరి సినిమా ను అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందబోతున్న విషయం తెల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube