బర్త్‌డేకు పాట పాడుతున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్త్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

 Balakrishna To Release Song On Birthday, Balakrishna, Nbk107, Boyapati Srinu, Bi-TeluguStop.com

ఈ సినిమాతో మరోసారి బాలయ్య తనదైన మార్క్‌ను వేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.

కాగా జూన్ 10వ తేదీన బాలయ్య తన పుట్టినరోజును జరుపుకుంటుండగా, ఆరోజు నందమూరి ఫ్యాన్స్ రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు.అయితే ఈ పుట్టినరోజున తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు బాలయ్య కూడా సిద్ధమవుతున్నాడు.

ఈ పుట్టినరోజున బాలయ్య కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.అయితే బాలయ్య తనవంతుగా ఓ పాటను పాడి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు.

దీనికి సంబంధించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన విషయం కూడా తెలిసిందే.

కాగా మరో సింగర్ సింహా సాయంతో బాలయ్య ఈ పాటను ఇప్పటికే పాడినట్లు తెలుస్తోంది.

బాలయ్య తన పుట్టినరోజున ఈ పాటను రిలీజ్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.యజమాన్య అనే మ్యూజిక్ డైరెక్టర్ ఈ పాటను రికార్డ్ చేసినట్లు తెలుస్తుండగా తన 60వ పుట్టినరోజు కానుకగా జూన్ 10న ఈ పాటను రిలీజ్ చేసేందుకు బాలయ్య రెడీ అయ్యాడు.

మరి బాలయ్య పాటకు ఫ్యాన్స్ గోల ఎలా ఉండబోతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube