నందమూరి బాలకృష్ణ కొంత గ్యాప్ తరువాత మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తన లేటెస్ట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.
ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు బాలయ్య.
ఈ సినిమాలో బాలయ్య డ్యుయెల్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో అఘోరాగా ఓ పాత్ర ఉండగా, ఫ్యాక్షనిస్ట్ పాత్ర ఒకటి ఉంటుందని తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో ఎవ్వరూ ఊహించని విధంగా బాలయ్య విలన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
రెండు పాత్రల్లో ఒకటి విలన్‌గా రివీల్ అవుతుందని, చిత్ర క్లైమాక్స్‌లో ఈ విషయం తెలుస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మొత్తానికి బాలయ్య అదిరిపోయే ట్విస్టుతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.
బోయపాటి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా శ్రియా నటిస్తుంది.మరి విలన్ పాత్రలో బాలయ్య ఎలా ఉంటాడో చూడాలి.