బాలయ్యను లైన్‌లో పెడుతున్న కళ్యాణ్ రామ్.. ఈసారైనా సెట్ అయ్యేనా?

నందమూరి బాలకృష్ణ కొంత గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే మొదలుపెట్టగా, ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Kalyan Ram To Lock Script For Balakrishna, Balakrishna, Nandamuri Kalyan Ram, To-TeluguStop.com

కాగా ఈ సినిమా టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

కాగా బాబాయి బాలయ్యతో ఎప్పట్నుండో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్.ఈ క్రమంలో తాజాగా ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టును ఆయన బాలయ్య కోసం సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కథ బాలయ్యకు అయితే బాక్సాఫీస్ రికార్డులు షేక్ కావడం ఖాయమని కళ్యాణ్ రామ్ భావిస్తోన్నాడు.దీంతో ఈ కథను ఎలాగైనా బాలయ్యకు వినిపించి, ఆయనతో ఈ సినిమాను చేయాలని కళ్యాణ్ రామ్ కోరుతున్నాడు.

ఇక గతంలో తన తమ్ముడు ఎన్టీఆర‌్‌తో ‘జై లవకుశ’ చిత్రాన్ని తెరకెక్కించగా అది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాను తన సొంత బ్యానర్‌ ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు.

దీంతో ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని బాలయ్యతో తెరకెక్కించేందుకు కళ్యాణ్ రామ్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.ఏదేమైనా ఇలా బాబాయ్ కోసం అబ్బాయి గిఫ్టు రెడీ చేయడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube