అటు నాగబాబు… ఇటు బాలయ్య బాబు! ఇండస్ట్రీలో ముదురుతున్న గొడవ  

Balakrishna Nagababu Tollywood - Telugu Balayya Comments, Chiranjeevi, Mega Family, Nagababu, Nandamoori Family, Tollywood

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి నుంచి ఆధిపత్య పోరు ఉంటుంది.నటుల నుంచి నిర్మాతల వరకు ప్రతి చోట కొంత మంది ఆధిపత్యం కనిపిస్తుంది.

 Balakrishna Nagababu Tollywood

ఈ ఆధిపత్య పోరు కారణంగా ఒక్కోసారి ఇండస్ట్రీలో జరిగే గొడవలు రాజకీయ రంగు పులుముకొని తారాస్థాయికి చేరుకుంటాయి.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో వివాదం సంచలనంగా మారింది.

కొద్ది రోజుల క్రితం చిరంజీవి ఇంట్లో నిర్మాతలు కొంత మంది మంత్రి తలసానితో సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో సినిమా షూటింగ్ లు తిరిగి ఎప్పుడు మొదలు పెట్టాలి అనే విషయం మీద చర్చించారు.

అటు నాగబాబు… ఇటు బాలయ్య బాబు ఇండస్ట్రీలో ముదురుతున్న గొడవ-Movie-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా ఈ మీటింగ్ పై బాలకృష్ణ తీవ్ర వాఖ్యలు చేశారు.ఆ సమావేశానికి తనను ఎవరూ పిలవలేదని, అందరూ కలిసి భూములు పంచుకోవడానికి సమావేశం అయ్యారని మాట్లాడారు.

అయితే ఈ వాఖ్యలపై నాగబాబు కౌంటర్ ఇచ్చారు.

ఆ సమావేశానికి బాలకృష్ణని పిలవకపోవడం తప్పే అంటూనే భూములు పంచుకోవడానికి కలిసారు అని మాట్లాడటం సరైన పద్ధతి కాదని బాలయ్య వెంటనే ఆ వాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే ఈ వ్యవహారం బయటకి రావడంతో సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ లో రెండు వర్గాలుగా విడిపోయారు.నిర్మాత ప్రసన్న కుమార్ బాలయ్య బాబుకి సపోర్ట్ గా మాట్లాడుతూ నాగబాబుకి బాలయ్యని విమర్శించే అర్హత లేదు అనే విధంగా మాట్లాడారు.

అలాగే ఆ మీటింగ్ కి హాజరైన నిర్మాత సి కళ్యాణ్ స్పందించి బాలకృష్ణకి సమావేశం గురించి చెప్పడం జరిగిందని, అయితే అది కేవలం నిర్మాతల సమావేశం అని, చిరంజీవి సిసిఎస్ బాధ్యతలు చూస్తూ ఉండటంతో అతను ముందున్నారని చెప్పారు.బాలకృష్ణ ఏ విషయంలో అయిన ముందుంటారని, ఆయన ఏదో సరదాగా అన్న వాఖ్యాలని సీరియస్ గా తీసుకోవద్దని అన్నారు.

బాలయ్య ఎందుకు అలా మాట్లాడారో తనకి తెలియదని, అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది అని తలసాని స్పష్టం చేశారు.అయితే ఈ వ్యవహారం ఇప్పుడు మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ మధ్య సోషల్ మీడియాలో పర్సనల్ వార్ గా మారిపోయింది.

మరి ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Balakrishna Nagababu Tollywood Related Telugu News,Photos/Pics,Images..

footer-test