సీనియర్ ఎన్టీఆర్ కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోలలో బాలకృష్ణ ఒకరు.అయితే గత 22 సంవత్సరాలుగా బాలయ్య సినీ కెరీర్ ను పరిశీలిస్తే బాలయ్య కెరీర్ లో యావరేజ్ గా నిలిచిన సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంది.బాలయ్య సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ లేకపోతే డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంటూ ఉండటం గమనార్హం.
2001 సంవత్సరంలో బాలయ్య నటించిన నరసింహ నాయుడు, భలేవాడివి బాసూ సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలలో నరసింహ నాయుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే భలేవాడివి బాసూ డిజాస్టర్ గా నిలిచింది.2002 సంవత్సరంలో సీమ సింహం, చెన్నకేశవరెడ్డి రిలీజైతే సీమ సింహం ఫ్లాప్ కాగా చెన్నకేశవరెడ్డి కమర్షియల్ గా హిట్ గా నిలిచింది.2003 సంవత్సరంలో విడుదలైన పలనాటి బ్రహ్మనాయుడు డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది.

2004 సంవత్సరంలో లక్ష్మీ నరసింహ, విజయేంద్ర వర్మ సినిమాలు విడుదల కాగా ఈ సినిమాలలో లక్ష్మీ నరసింహ సక్సెస్ సాధిస్తే విజయేంద్ర వర్మ డిజాస్టర్ గా నిలిచింది. అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి.సింహాతో సక్సెస్ అందుకున్న బాలయ్యకు పరమవీరచక్ర సినిమాతో షాక్ తగిలింది. శ్రీరామరాజ్యం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా ఫెయిల్యూర్ అనే చెప్పాలి.

అధినాయకుడు, ఊకొడతారా ఉలిక్కిపడతారా, శ్రీమన్నారాయణ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.లెజెండ్ తో సక్సెస్ అందుకున్న బాలయ్యకు లయన్, డిక్టేటర్ ఫలితాలు షాకిచ్చాయి.గౌతమీపుత్ర శాతకర్ణితో బాలయ్య సక్సెస్ సాధించగా పైసా వసూల్ ఫలితం షాకిచ్చింది.జై సింహా యావరేజ్ గా నిలవగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి.
అఖండ మాత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది.బాలయ్య సినీ కెరీర్ లో యావరేజ్ ఫలితాన్ని అందుకున్న సినిమాలు చాలా తక్కువగా ఉండటం గమనార్హం.