బాలయ్య బర్త్ డే అప్డేట్.. త్వరలోనే వేట స్టార్ట్ !

ఈ రోజు నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.అనుకున్న విధంగానే బాలయ్య పుట్టిన రోజు కానుకగా ఆయనకు సుర్ప్రైజ్ లు ఇస్తున్నారు.

 Balakrishna Movie With Gopichand Malineni-TeluguStop.com

తాజాగా మైత్రి మూవీ మేకర్స్ బాలయ్యతో సినిమాను కన్ఫర్మ్ చేసింది.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన తర్వాత చేయబోతున్న సినిమాను అనౌన్స్ చేసింది.

బాలయ్య గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేయబోతున్నాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.అయితే ఆ వార్తలు నిజమేనని ఈ రోజు అధికారికంగా ప్రకటించారు.గోపీచంద్ మలినేని మాస్ రాజా రవితేజ తో తీసిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే బాలయ్య ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.బాలయ్య కోసం గోపీచంద్ మలినేని ఇప్పటికే ఒక పవర్ ఫుల్ కథను కూడా రెడీ చేసాడని టాక్.

 Balakrishna Movie With Gopichand Malineni-బాలయ్య బర్త్ డే అప్డేట్.. త్వరలోనే వేట స్టార్ట్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

#NBK 107 మూవీను త్వరలోనే ప్రారంభం కానుందని ప్రకటించారు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా మైత్రి ఒక పోస్టర్ ను విడుదల చేసింది.ఆయన ఇమేజ్ కు తగ్గట్టు ఆ పోస్టర్ లో సింహం వేటాడేందుకు సిద్ధంగా ఉందని త్వరలోనే వేట స్టార్ట్ చేస్తాం అని ప్రకటించారు.

ఇది ఇలా ఉండగా బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

https://youtu.be/Wg-L56A5Obg
#Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు