బిబి3ః వెనక్కు తగ్గిన బోయపాటి, ఊపిరి పీల్చుకుంటున్న నందమూరి అభిమానులు

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌ లో రూపొందుతున్న సినిమా విడుదల తేదీ ప్రకటించారు.కాని ఇప్పటి వరకు టైటిల్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు.

 Balakrishna Movie Update Boyapati Srinu Key Change ,balakrishna,tollywood,bb 3,l-TeluguStop.com

సినిమా గురించి ఆరంభం అయినప్పటి నుండి ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.ఇప్పటికే బోయపాటితో బాలయ్య చేసిన రెండు సినిమాలు సూపర్ సక్సెస్‌ అయ్యాయి.

కనుక ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు.కనుక సినిమా పై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో చిన్న వార్త కూడా పెద్దగా ప్రచారం జరుగుతోంది.

ఆ మద్య సినిమా లో బాలకృష్ణ కొన్ని సీన్స్ లో అఘోరా గా కనిపిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి.బాలయ్య ను అఘోరాగా చూడటం సాధ్యమేనా అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య ను అఘోరా గా చూపించడం లో కాస్త అటు ఇటు అయినా కూడా వినయ విధేయ రామ సినిమా మాదిరిగా అంచనాలు తల కిందులు అవ్వడం ఖాయం అంటున్నారు.

బాలకృష్ణ ను అఘోరా గా చూపించే ప్రయత్నం చేస్తున్న బాలకృష్ణ లాక్ డౌన్ టైమ్‌ లో తన నిర్ణయం మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.

బాలకృష్ణ సినిమా లో అఘోరా గా కనిపిస్తే అభిమానులు ఎలా రియాక్ట్‌ అవుతారో అనే ఉద్దేశ్యంతో తన నిర్ణయాన్ని మార్చుకుని సినిమా లో ఆ పాత్ర తీరును మార్చినట్లుగా తెలుస్తోంది. వారణాసి బ్యాక్‌ డ్రాప్ అలాగే ఉంచి సినిమా స్క్రిప్ట్‌ తో పాటు మెయిన్ కథలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటికే సినిమా చిత్రీకరణ సగం వరకు పూర్తి అయ్యింది.లాక్‌ డౌన్ తర్వాత కాస్త ఆలస్యంగా మొదలు పెట్టినా కూడా సినిమా విడుదల తేదీ ప్రకటించిన కారణంగా హడా వుడి గా సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

వరుసగా వస్తున్న సినిమాల పోటీని ఈ సినిమా ఎలా తట్టుకుంటుందో చూడాలి.ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతుంది.అఘోరా పాత్రను తొలగించడంతో నందమూరి అభిమానులు ఊరిపి పీల్చుకునే అవకాశం ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube