ఎన్టీఆర్ డైలాగ్‌కే ఫిక్స్ అవుతున్న బాలయ్య

నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే.ఆయనకు గతంలో సింహా, లెజెండ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్లు అందించిన మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Balakrishna Movie Title Torch Bearer Finalized, Balakrishna, Boyapati, Bb3, Torc-TeluguStop.com

ఇక ఈ సినిమాను బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా బోయపాటి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమాలోని ఓ పాత్రకు సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.అయితే కరోనా కరాణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.కాగా ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారా అని ప్రేక్షకులతో పాటు చిత్ర వర్గాల్లో తెగ చర్చ సాగుతోంది.ఈ సినిమాకు మొదట్నుండీ మోనార్క్, సూపర్ మ్యాన్ వంటి పలు టైటిళ్లు వినిపించినా, టార్చ్ బేరర్ అనే టైటిల్ ఈ సినిమాకు బాగా సెట్ అవుతుందని చిత్ర వర్గాల్లో టాక్ బలంగా వినిపించింది.

దీంతో ఈ సినిమాకు ఈ టైటిల్‌నే ఫైనల్ చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుందట.ఈ మేరకు టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం వారు ప్రయత్ని్స్తున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’లోని ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌లోని లైన్‌ను తమ సినిమాకు టైటిల్‌గా తీసుకున్న బోయపాటి, ఈ సినిమా కథను ఆ పదానికి ఎంతమేర న్యాయం చేస్తాడా అనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ ప్రగ్యా మార్టిన్‌ను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తు్న్నాయి.

మరి ఈ సినిమాకు నిజంగానే టార్చ్ బేరర్ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేస్తుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube