దసరా రోజు తేల్చేస్తానంటోన్న టార్చ్ బేరర్  

Balakrishna Movie Title To Reveal On Dussehra, Balakrishna, BB3, Boyapati Sreenu, Torch Bearer, Monarch, Tollywood News - Telugu Balakrishna, Bb3, Boyapati Sreenu, Monarch, Tollywood News, Torch Bearer

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాలయ్య ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

TeluguStop.com - Balakrishna Movie Title To Reveal On Dussehra

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈ క్రమంలో మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని చిత్ర వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఇక ఈ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

TeluguStop.com - దసరా రోజు తేల్చేస్తానంటోన్న టార్చ్ బేరర్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఇందులో బాలయ్య ఎలా కనిపిస్తాడా అని నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, అందులో ఒకటి రైతు పాత్ర కాగా, మరొకటి అఘోరా పాత్ర కావడం విశేషం.

ఇక ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉంటుందని, ప్రేక్షకులు ఊహించని విధంగా బాలయ్య తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేస్తాడని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాకు తొలుత ‘మోనార్క్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, రీసెంట్‌గా ఈ సినిమాకు ‘టార్చ్ బేరర్’ అనే టైటిల్‌ను పెడుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమాకు ఏ టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.దీంతో ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ దసరా కానుకగా అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను ఎంత పవర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నారో, అంతే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.ఇక బోయపాటి గతంలో బాలయ్యతో తెరకెక్కించిన సింహా, లెజెండ్ తరహాలోనే ఈ సినిమా కూడా ఉండబోతుందని, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం ఈ సినిమా తగ్గకుండా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా వేసుకున్న ఈ సినిమాను అతి త్వరలో తిరిగి ప్రారంభించేందుకు బాలయ్య అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

#Balakrishna #Monarch #Torch Bearer #Boyapati Sreenu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Balakrishna Movie Title To Reveal On Dussehra Related Telugu News,Photos/Pics,Images..