3 నెలల్లో పూర్తి చేశారు, 3 రోజులైనా ఆడేనా?

బాలకృష్ణ హీరోగా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రూలర్‌’ చిత్రం షూటింగ్‌ ముగిసిందంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.చిత్రంపై పెద్దగా ఆసక్తి లేదు.

 Balakrishna Movie Rula Complete In Three Months-TeluguStop.com

అయినా కూడా హడావుడిగా సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.కేవలం మూడు నెలల్లోనే షూటింగ్‌ను చుట్టేసి సినిమాను తెరకెక్కించారు.

ఈమద్య కాలంలో ప్రతి సినిమా కూడా కనీసం ఆరు నెలల సమయం పడుతుంది.అలాంటిది ఈ సినిమాను మూడు నెలల్లో ఎలా పూర్తి చేశారో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చాలా స్పీడ్‌గా సినిమా తెరకెక్కింది కనుక ఫలితం ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ముఖ్యంగా సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలు మరియు ఇతర ముఖ్య సీన్స్‌ చిత్రీకరణ ఎలా వచ్చి ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విమర్శకులు మాత్రం మూడు నెలల్లో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కనీసం మూడు రోజులు అయినా నిలబడేనా అంటూ కామెడీ చేస్తున్నారు.బాలయ్య సినిమాల సంఖ్య పెంచుకుంటున్నాడు తప్ప సక్సెస్‌ కొట్టే ఉద్దేశ్యం ఉన్నట్లుగా లేదు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరి రూలర్‌ గా బాలయ్య ఆకట్టుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube