బాలయ్య బాబు రూరల్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్

బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రూలర్.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

 Balakrishna Movie First Video Song Teaser-TeluguStop.com

ఈ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా బాలకృష్ణ కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు.ఇక బాలకృష్ణ యాంగిల్ లోనే మాస్ యాక్షన్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి శాతకర్ణికి మ్యూజిక్ అందించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.అయన స్వరపరిచిన అడుగడుగో యాక్షన్ హీరో అనే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ని చిత్ర యూనిట్ రేపు ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతుంది.

రేపు ఉదయమే ఈ సాంగ్ టీజర్ ప్రేక్షకుల ముందుకి వస్తుంది.ఇక మూడు విభిన్న లుక్స్ తో కనిపిస్తున్న బాలకృష్ణకి జోడీగా ఈ సినిమాలో అతని లక్కీ హీరోయిన్ సోనాల్ చౌహన్ తో పాటు మరో హీరోయిన్ గా వేదిక నటిస్తుంది.

ప్రకాష్ రాజ్, భూమిక కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.అభిమానులు ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు పెట్టుకున్న నందమూరి ఫాన్స్ ని ఈ సాంగ్ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube