వినాయక చవితి బాలయ్య అభిమానులకు స్పెషల్‌ కాబోతుందట

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా షూటింగ్‌ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా చివరి దశలో నిలిచి పోయింది.అన్ని అనుకున్నట్లుగా జరిగి కరోనా వచ్చి ఉండకుంటే సినిమా మే చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది.

 Balakrishna Movie Akhanda Release Date-TeluguStop.com

కాని ఇప్పటి వరకు షూటింగ్‌ నే పూర్తి చేయలేదు.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన చివరి దశ షూటింగ్‌ కు రంగం సిద్దం అయ్యింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జులై మొదటి వారంలో అఖండ సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.పెద్ద ఎత్తున అఖండ సినిమా యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ తో షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

 Balakrishna Movie Akhanda Release Date-వినాయక చవితి బాలయ్య అభిమానులకు స్పెషల్‌ కాబోతుందట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందుతున్న అఖండ సినిమా కొత్త విడుదల తేదీపై ప్రస్తుతం ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

సినిమా షూటింగ్‌ ను పునః ప్రారంభించి ఆగస్టు మొదటి వారంకు షూటింగ్ ను ముగించాలని భావిస్తున్నారు.

ఆ తర్వాత వెంటనే నిర్మాణానంతర కార్యక్రమాలను మొదలు పెట్టి వెంటనే విడుదల చేయాలని భావిస్తున్నారు.ఇప్పటి వరకు వినాయక చవితి సందర్బంగా సినిమా విడుదల తేదీలను ఏ సినిమా నిర్మాతలు ప్రకటించలేదు.

కనుక వినాయక చవితి సందర్బంగా బాలయ్య అభిమానులకు ఈ సినిమా ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.బాలయ్య అభిమానులు అఖండ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Akhanda, Akhanda Release Date, Balakrishna, Boyapati, Film News, Movie News, Pragya Jaiswal, Tollywood-Movie

అఖండ సినిమా కు ముందు బాలయ్య మరియు బోయపాటి ల కాంబోలో వచ్చిన సింహా మరియు లెజెండ్‌ సినిమా లను తెరకెక్కించారు.ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.కనుక అఖండ సినిమా మరో లెవల్‌ లో ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. అఖండలో బాలకృష్ణ కు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌ గా నటించగా కీలక పాత్రలో పూర్ణ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

#Pragya Jaiswal #Balakrishna #Boyapati #AkhandaRelease #Akhanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు