మోనార్క్ చాలా ‘డేంజర్’ అంటోన్న బాలయ్య

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తనకు ఎంతో కలిసొచ్చిన హీరో నందమూరి బాలకృష్ణతో తన తాజా చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు ఈ మాస్ డైరెక్టర్.

 Balakrishna Movie Title Danger Not Monarch, Balakrishna, Monarch, Danger, Boyapa-TeluguStop.com

ఇక గతంలో బాలయ్యకు సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు హ్యా్ట్రిక్ అందించేందుకు రెడీ అయ్యాడు.ఇక బాలయ్య కూడా గతకొంత కాలంగా సరైన బ్లాక్‌బస్టర్ లేకపోవడంతో నిరాశగా ఉన్నాడు.

అయితే ఈసారి కూడా బాలయ్య కోసం బోయపాటి రెడీ చేసిన కథ మాస్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది.

ఆయన చేయబోయే పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయట.ఒక పాత్రలో రైతుగా కనిపించే బాలయ్య, మరో పాత్రలో అఘోరాగా కనిపిస్తాడట.

దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ అంచనాలు ఇటీవల రిలీజ్ అయిన టీజర్ మరింత పెంచేసింది.

అయితే ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పెట్టాలని అనుకుంది.

కానీ సినిమాకు మరింత హైప్ తెచ్చే క్రమంలో ఈ సినిమాకు డేంజర్ అనే టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

బాలయ్యతో పెట్టుకుంటే ఎంతటివారికైనా ‘డేంజర్’ అనే విషయాన్ని ఈ సినిమాలో మనకు చూపించనున్న కారణంగా టైటిల్ ఇదైతే బాగుంటుందని బోయపాటి అండ్ టీమ్ భావిస్తున్నారు.మరి ఈ సినిమాకు నిజంగానే డేంజర్ అనే టైటిల్‌ను పెడతారా లేక వేరే టైటిల్‌ను అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube