మోనార్క్ టైటిల్‌ను పక్కనబెట్టిన బాలయ్య.. ఆ ఫ్లాప్ మూవీయే కారణమా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించిన బాలయ్య, షూటింగ్ కూడా మొదలుపెట్టాడు.

 Balakrishna Monarch Title Not Fixed, Balakrishna, Monarch, Ditator, Boyapati Sri-TeluguStop.com

కాగా కరోనా ప్రభావంతో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఇక ఈ సినిమాను మరోసారి పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడు.

గతంలో సింహా, లెజెండ్ వంటి సినిమాలు అందించిన బోయపాటి, ఈసారి బాలయ్యతో అంతకుమించిన సినిమాను అందించేందుకు రెడీ అయ్యాడు.కాగా ఈ సినిమా టైటిల్ విషయంలో బోయపాటి మరోసారి తనదైన మార్క్ వేసుకోవాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ ఈ టైటిల్ బాలయ్య గతంలో నటించిన ‘డిక్టేటర్’ టైటిల్‌కు చాలా దగ్గరగా ఉండటంతో ఈ టైటిల్‌ను పక్కనబెట్టారు.

గతంలో బాలయ్య నటించిన డిక్టేటర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది.ఆ సినిమాపై బాలయ్య భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ రొటీన్ కథ కావడంతో ప్రేక్షకులు ఆ సినిమాను రిజెక్ట్ చేశారు.

ఇప్పుడు అదే తరహా టైటిల్ పెడితే తమ సినిమాపై నెగెటివ్ ప్రభావం పడుతుందని చిత్ర యూనిట్ భావించి, మోనార్క్ టైటిల్‌ను రద్దు చేసుకున్నారు.మరి బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube