రూలర్ దెబ్బకి భయపడుతున్న బోయపాటి సినిమా నిర్మాత...

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం రూలర్.ఈ చిత్రం ఈనెల 20వ తారీఖున విడుదలై బ్లాక్ బస్తర్  టాక్ ను సొంతం చేసుకుంది.

 Balakrishna Miriyala Ravinder Reddy Ruler Boyapati Srinu-TeluguStop.com

ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన సోనాల్ చౌహాన్ వేదిక కథానాయికలుగా నటించారు.ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించాడు.

అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

అంతేగాక ఈ చిత్రంలో బాలకృష్ణ కొత్త లుక్ పై అప్పట్లో సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు.అయితే ఇదే ఇలా ఉండగా గతంలో తన తండ్రి నందమూరి తారక రామారావు గారి బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ రెండు చిత్రాలు డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.దీంతో ఇప్పుడు ఆ ప్రభావం బాలయ్య బాబు సినీ కెరియర్ పై పడినట్టు తెలుస్తోంది.

అయితే రూలర్ చిత్రం తర్వాత బాలయ్య బాబు బోయపాటి చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పగా ఇప్పటికే ఈ సినిమాను పలువురు పెద్దల సమక్షంలో ప్రారంభించారు.ఈ చిత్రానికి మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Telugu Balakrishna, Boyapati Srinu, Tollywood-

అయితే రూలర్ చిత్రం ఫలితాలు తెలుసుకున్న రవీందర్ రెడ్డి ప్రస్తుతం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.అంతేగాక కథానాయకుడు బాలయ్య బాబు, దర్శకుడు బోయపాటి శ్రీను పారితోషికానికి బదులుగా సినిమా విడుదల తర్వాత వచ్చిన లాభాల్లో వాటా తీసుకునేందుకు ఒప్పుకుంటే నే ఈ చిత్రాన్ని నిర్మిస్తారని లేదంటే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించలేనని చెప్పినట్లు టాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ వినిపిస్తున్నాయి.దీంతో నిర్మాత పెట్టిన కండిషన్లకు బాలయ్య బాబు, బోయపాటి శ్రీను లు ఒప్పుకోకపోవడంతో తో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా తప్పుకున్నట్లు తెలుస్తోంది.  దీంతో ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టును ఎవరైనా నిర్మాతగా చేస్తారా అంటూ ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు పలువురు నిర్మాతలను సంప్రదించినట్లు సమాచారం.

అయితే చూడాలి మరి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు అనేది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube