ఏపీ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్లు చేసిన బాలకృష్ణ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.దీంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉండగా మరో పక్క కేసులు పెరిగిపోతుండటంతో వైద్యం కొరత ఏర్పడి అనేక మంది ప్రాణాలు విడిచే పరిస్థితి.

 Balakrishna Made Serious Comments On Ap Government-TeluguStop.com

  అనంతపురం జిల్లా ఆసుపత్రిలో కూడా ఇటీవల ఒకేరోజు దాదాపు పదిహేను మంది మృత్యువాత పడటంతో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే టీడీపీ నేత బాలకృష్ణ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు.

చాలావరకు మరణాలు సంభవించడానికి గల కారణం ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడమే అని కరోనా బారిన పడి.మృతిచెందిన రోగుల బంధువులు ఆరోపించడంతో ఏపీ ప్రభుత్వంపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో ఈ విధంగా సంఘటన జరగటం, పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం దారుణమని అన్నారు.

 Balakrishna Made Serious Comments On Ap Government-ఏపీ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్లు చేసిన బాలకృష్ణ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో చెలగాటమాడుతోంది అని మృతి చెందిన కుటుంబాలకు వెంటనే 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి సంఘటన జరిగిందని మండిపడ్డారు.

#Balakrishna #Hindhupuram #Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు