4. 25 కేజీల బరువు తగ్గేందుకు బాలయ్య ప్రయత్నం

ఖైదీ నెం.150 చిత్రంతో పోల్చితే చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలో కాస్త సన్నగా వయసు తగ్గి కనిపించినట్లుగా ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సీనియర్‌ హీరోలు మరీ ఎక్కువ బరువుతో కనిపించడం వల్ల వయసు ఎక్కువగా అనిపిస్తుంది.ఇప్పటికే ఆరు పదుల వయసులు దాటిన సీనియర్‌ హీరోలు బరువు తగ్గి కనీసం 20 ఏళ్లు అయినా తగ్గినట్లుగా కనిపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

 Balakrishna Latest Update-TeluguStop.com

అందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Balakrishna, Ks Ravi Kumar, Chiranjeevi, Tollywood-

  బరువు తగ్గాలని భావిస్తున్న హీరోల్లో బాలయ్య కూడా వచ్చి చేరాడు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం బాలయ్య తన 105వ చిత్రంను కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో చేస్తున్నాడు.ఆ చిత్రం మరి కొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తి కాబోతుంది.

ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని వచ్చే ఏడాది మొదటి లేదా రెండవ నెలలో బోయపాటి దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నారు.భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందబోతున్న ఆ చిత్రం కోసం ఏకంగా 25 కేజీల బరువును బాలయ్య తగ్గనున్నాడట.

బాలయ్య 105వ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత బాలయ్య పూర్తిగా రెండు లేదా మూడు నెలలు కష్టపడి బోయపాటి సినిమా కోసం 25 కేజీల బరువు తగ్గబోతున్నాడు.అందుకు సంబంధించిన వర్కౌట్స్‌ ఇప్పటి నుండే ప్రారంభం అయినట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌లో దర్శకుడు బోయపాటి ఉన్నాడు.వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ అయ్యాయి.

అందుకే ఈ చిత్రంతో హ్యాట్రిక్‌ ఖాయం అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube