బాలయ్య నీ సందడి ఏదయ్యా?  

Balakrishna Latest Movie Update News-balakrishna Tollywood Hero

నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం రూలర్‌ విడుదలకు సిద్దం అవుతుంది.ఈనెలలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నరు.ఈ సినిమాకు ఏమాత్రం హైప్‌ లేదు.అసలు చిత్రానికి హైప్‌ క్రియేట్‌ చేసేందుకు వారు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

Balakrishna Latest Movie Update News-balakrishna Tollywood Hero Telugu Tollywood Movie Cinema Film Latest News Balakrishna Latest Movie Update News-balakrishna Tollywood Hero-Balakrishna Latest Movie Update News-Balakrishna Tollywood Hero

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రూలర్‌ సినిమాను హైప్‌ లేకుండా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట.అలా చేయడం వల్లే మామూలుగా ఉన్నా ప్రేక్షకులు నచ్చుతారని భావిస్తున్నారు.

పబ్లిసిటీ మరీ తక్కువ అవ్వడం వల్ల అసలు సినిమాకు ఏమాత్రం బజ్‌ క్రియేట్‌ కాలేదు.దాంతో సినిమాను ప్రేక్షకులు అసలు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

పెద్ద ఎత్తున ఈ సినిమా బిజినెస్‌ చేయాలని ప్రయత్నాలు చేసినా కూడా అది సాధ్యం కావడం లేదు.ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమాను అసలు కొనుగోలు చేసేందుకు బయ్యర్లు లేరంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.మరీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో రూలర్‌ సినిమాను జనాలు ఆధరిస్తారా అంటూ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.