షూటింగ్ కోసం వెళ్లి చిక్కుకున్న బాలకృష్ణ ,కృష్ణం రాజు..బిస్కట్స్, చేపలతో ప్రాణం కాపాడుకున్నారు

1999 వ సంవత్సరంలో విడుదలైన బాలయ్య గారి సుల్తాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వకపోయినా ఓ మాదిరిగా ఆడింది.అంటే సినిమా సక్సెస్ గురించి పక్కన పెడితే ఈ సినిమాలో ముగ్గురు కృష్ణులు పోటీపడి నటించడం విశేషం.

 Unknown Facts About Balakrishna Sultan Movie, Balakrishna, Sultan Movie, Krishn-TeluguStop.com

హీరో అండ్ విలన్ పాత్రల్లో బాలకృష్ణ అదిరిపోయేలా నటించి ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేస్తే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ గా సూపర్ కృష్ణ అండ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇద్దరు కూడా థియేటర్స్ లో విజుల్స్ పడేలా నటించారు.అలా ముగ్గురు కృష్ణులు ఉంటటం వలన ఈ సినిమా విడుదలకు ముందు విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది.

వివిధ రకాల వేషాల్లో కనిపిస్తున్న బాలయ్యను ట్రైలర్ లో చూసి ఈ సినిమా ఒక బ్లాక్ బాస్టర్ సినిమాగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఎందుకో ఈ సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు.

అయితే ఈ సినిమా కోసం డైరెక్టర్ శరత్ అండ్ రైటర్స్ అయిన పరుచూరి బ్రదర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారట.

సినిమాలోని ముగ్గురు హీరోలలో ఎవరి ఇమేజ్ కి తగ్గట్టు వాళ్ల పాత్రను తగ్గకుండా చేసుకున్నారట.ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచేలా కథను సిద్ధం చేసుకున్నారు.

మాములుగా ఈ కథ రాసుకున్నప్పుడు ఒక పవర్ఫుల్ సీబీఐ ఆఫీసర్ గా, ఒక పోలీస్ ఆఫీసర్ గా ఎవరైతే బాగుంటారని చాల చర్చలు జరిగాయట అప్పుడు పరుచూరి బ్రదర్స్ సీబీఐ ఆఫీసర్ గా కృష్ణం రాజుని, పోలీస్ ఆఫీసర్ గా కృష్ణ గారి తీసుకుంటే బావుంటుందని సూచించారట.దానికి సినిమా టీం అంతా ఓకే అనడంతో వాళ్ళని సంప్రదించారట.

అప్పుడు కథ కూడా బావుండడంతో కృష్ణ అండ్ కృష్ణంరాజులు బాలయ్య బాబుతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.మాములుగా అప్పట్లో కృష్ణ గారు ఎన్టీఆర్ తో కలిసి 5 సినిమాల వరకు నటించారు.

అంతేకాదు ఎన్టీఆర్ తనయులు బాలకృష్ణ, హరికృష్ణలిద్దరితోను నటించారు.

Telugu Andaman Islands, Balakrishna, Krishna, Krishnam Raju, Sultan, Sulthan, Vi

ఇక ఈ సినిమా కాస్టింగ్ అంత ఓకే అయిపోయి సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు సీనియర్ హీరోలైన కృష్ణ గారితో, కృష్ణంరాజుగారితో ఉన్న సీన్లన్నీ త్వరగా షూటింగ్ చేసేద్దామని చెప్పాడట బాలకృష్ణ దాంతో బాలయ్య కోరిక మేరకు ముందు వాళ్ళతో ఉన్న షెడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసేసారు.ఇందులో భాగంగానే కొంత సినిమా షూటింగ్ అండమాన్ దీవుల్లో ఉండడం వలన ఎటు అండమాన్ వెళ్తున్నాం కదా సరదాగా మన ఫ్యామిలీస్ తో ట్రిప్ వేసినట్టు కూడా ఉంటుందని అనుకోని కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా వెంట బెట్టుకొని అండమాన్ వెళ్లారట.అయితే అప్పట్లో అక్కడ వాతావరణం, లొకేషన్స్ ఇవన్నీ సూపర్ గా ఉన్నా.

ఉండటానికి మాత్రం రాజీవ్ గాంధీ గెస్ట్ హౌజ్ తప్ప వేరే ఏమీ లేదట.తినడానికి తిండి కూడా దొరికేది కాదట.

ఇక చేసేదేమీ లేక అందరూ అక్కడే అడ్జస్ట్ అయ్యారు.

Telugu Andaman Islands, Balakrishna, Krishna, Krishnam Raju, Sultan, Sulthan, Vi

ఇక వెళ్లిన రోజు అక్కడ తినడానికి ఏమి లేకపోవడం వలన బిస్కెట్లు, చిన్న చిన్న చిరు తిండ్లతో కాలం గడిపేసారట.అయితే ఆ తర్వాత రోజు బయట ఎక్కడి నుంచో బియ్యం కూరగాయలు తెప్పించారట.వాటితో అద్భుతంగా విజయనిర్మల గారు వంట చేసి పెడితే అంత లొట్టలేసుకుంటూ తిన్నారట.

అంతేకాదు మన బాలయ్య బాబు ఎక్కడున్నా అందరితో బాగా కలిసిపోతాడు కాబట్టి సముద్రంలోని చేపలని వేటాడి మరీ పట్టుకొచ్సి విజయ నిర్మల గారికి ఇస్తే ఆమె వాటితో చేపల పులుసు పెట్టిందట.అయితే ఆ చేపల పులుసు అదిరిపోవడంతో లొకేషన్ లోకి కూడా పట్టుకెళ్ళారట.

సినిమా టీం అంతా విజయ నిర్మలగారి వంటని ఆవురావురమంటూ తిన్నారట.దాంతో ఇండస్ట్రీలో విజయనిర్మలమ్మ గారి చేపల పులుసుకు మంచి పేరు వచ్చింది.

ఆమె కూడా చాలా ఆనదించారట.ఏదిఏమైనా ఈ సినిమాలో ముగ్గురు కృష్ణులు నటించడం వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి అండమాన్ వెళ్లి సరదాగా గడపడం ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి.

ఇక ఈ సినిమాలో రోజా అండ్ రచన బెనర్జీ.బాలయ్య బాబు పక్కన హీరోయిన్లుగా నటించారు.

ఇక ఈ సినిమాకి షబ్బా షబ్బా షబ్బారె అంటూ అదిరిపోయే పాటలను మనకందించారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube