ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని బాలయ్యకు ముందే తెలుసా..?

నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.మాస్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

 Balakrishna Does That Flop Movie Just Because Of His Father Ntr Wish With Kodan-TeluguStop.com

ఈ మధ్య కాలంలో బాలకృష్ణ నటించిన లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు మాత్రమే హిట్ సినిమాలుగా నిలిచాయి.
అయితే బాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఒక సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసినా ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సాధారణంగా కొన్ని సినిమాలు స్క్రిప్ట్ దశలోనే హిట్ అవుతాయో ఫ్లాప్ అవుతాయో హీరోలు, దర్శకనిర్మాతలు అంచనా వేయగలుగుతారు.కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో బాలయ్య హీరోగా తిరగబడ్డ తెలుగుబిడ్డ పేరుతో ఒక సినిమా తెరకెక్కింది.

అయితే సీనియర్ ఎన్టీఆర్ కు కథ నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కింది.

Telugu Balakrishna, Balakrishnaflop, Kodanda Rami, Kodandarami-Movie

దర్శకుడు కోదండ రామిరెడ్డికి, హీరో బాలకృష్ణకు ఈ కథ అస్సలు నచ్చలేదు.దర్శకుడు సీనియర్ ఎన్టీఆర్ కు తనకు ఈ కథ నచ్చలేదని చెప్పగా సీనియర్ ఎన్టీఆర్ ఆ కథను కచ్చితంగా తెరకెక్కించాలని ఆర్డర్ వేయడంతో కోదండ రామిరెడ్డికి ఆ సినిమా చేయక తప్పలేదు.హీరో, దర్శకుడు ఇష్టం లేకుండా చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలవడం గమనార్హం.

ఈ మూవీలో బాలకృష్ణ బ్రేక్ డ్యాన్స్ చేయడం విశేషం.
మరోవైపు అఖండ సినిమా తరువాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నారు.

సక్సెస్ లో ఉన్న దర్శకులకే బాలకృష్ణ ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం.బాలయ్య తరువాత సినిమాలు కూడా భారీ బడ్జెట్లతో తెరకెక్కుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube