టీడీపీలో బాలయ్యకి కీలక భాద్యతలు..  

Balakrishna Key Role Play In Rayalaseema-

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే.పోరులో తప్పకుండా ఒకరు గెలుపు ఒకరు ఓటమిని మోయక తప్పదు.కానీ ఏపీలో 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఓటమి ఘోరాతి ఘోరంగా, కోలుకోలేని విధంగా మారిపోయింది.ఈ ఓటమితో టీడీపీలో భారీ స్థాయిలో మార్పులు కూడా చోటు చేసుకున్నాయి.అయితే ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టుకోవడం తప్ప వేరే దారిలేదు చంద్రబాబుకి.గతంలో కంటే కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరింత వేగంగా పావులు కదపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Balakrishna Key Role Play In Rayalaseema--Balakrishna Key Role Play In Rayalaseema-

కానీ వయసు మీద పడటంతో చంద్రబాబు స్పీడు కి ఒకింత బ్రేకులు పడుతున్నాయి.జగన్ వాఖ్చాతుర్యం ముందు, వైసీపీ నేతల మాటల దాడి ముందు చంద్రబాబు తేలిపోతున్నారు.

Balakrishna Key Role Play In Rayalaseema--Balakrishna Key Role Play In Rayalaseema-

ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో సైతం పార్టీని నిలబెట్టుకోవడానికి సత్తా ఉన్న నాయకుల అవసరం చాలా ఉంది.ముఖ్యమైన కేంద్రాలలో పార్టీని నిలబెట్టుకోవాలి, అందుకు సమర్ధవంతమైన నాయకులు కావాలి.ఎన్నికల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నా సరే, సీమ జిల్లాలలో టీడీపీ పరిస్థితి మాత్రం దారుణంగా తయారయ్యింది.కర్నూల్, కడప, చిత్తూరు ఈ మూడు జిల్లాలలో టీడీపీ కి ముచ్చటగా మూడంటే మూడు సీట్లు మాత్రమే వచ్చాయి.

ఈ మూడు జిల్లాలలో చంద్రబాబు అభివృద్ధి చేసినట్టుగా మరే జిల్లాలలో చేయలేదు అనేది అందరికి తెలిసిన విషయమే.అయితే అంతగా బాబు ఈ జిల్లాలని అభివృద్ధి చేసినా ఎందుకు ఓటమి చవి చూడాల్సి వచ్చింది అనేది అంతుబట్టని ప్రశ్నగా మారింది.ఇదిలాఉంటే మూలిగే నక్కపై తాటికాయలా నేతల గోడ దూకుళ్ళు బాబుని కుదిపేస్తున్నాయి.ఈ క్రమంలోనే సీమ జిల్లాల భాద్యతని బాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కి అప్పగిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన పార్టీలో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే

చంద్రబాబు కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారని, త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు పార్టీలో చర్చ జరుగుతోందట.మరి పార్టీ నేతలు, చంద్రబాబు అనుకుంటున్నట్టుగా సీమ జిల్లాలకి బాలయ్యని ఇంచార్జ్ గా బాబు నియమిస్తారా లేదా అనేది త్వరలో తేలిపోనుంది.