ఇరకాటంలో పెట్టిన బాలయ్య.. ఎవరినో తెలుసా?  

Balakrishna Keeps Sithara Entertainment Waiting - Telugu Ayyappanum Koshiyum, Balakrishna, Malayalam Remake, Tollywood News

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్ట్రెయిట్ చిత్రాలు ఎన్ని రిలీజ్ అవుతున్నాయో, రీమేక్ చిత్రాలు కూడా అంతే స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి.గతంలో వరుసగా రీమేక్ చిత్రాలను రిలీజ్ చేసినా తెలుగు ప్రేక్షకులు వాటిని ఆదరించారు.

 Balakrishna Keeps Sithara Entertainment Waiting

అయితే ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ఓ సినిమాను తెలుగులో ఎవరు రీమేక్ చేస్తారా అంటూ గతకొద్ది రోజులుగా టాలీవుడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మలయాళంలో సూపర్ సక్సెస్‌ను నమోదు చేసుకున్న ‘అయ్యప్పనుం కొషియుం’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసే రైట్స్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు సొంతం చేసుకున్నారు.

కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటించాల్సి ఉంది.ఒక హీరోగా పృథ్విరాజ్ పాత్రలో మాస్ రాజా రవితేజ నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే మరో హీరో బిజు మీనన్ పాత్రలో నందమూరి బాలకృష్ణను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.దీంతో ఆయన్ను ఈ సినిమాలో నటించాలని వారు కోరారు.
అయితే ఈ సినిమాను బాలయ్య ఇంకా చూడలేదు.ఈ చిత్ర కథ ఏమిటో కూడా ఆయనకు తెలీదు.దీంతో ఈ సినిమాను చూసిన తరువాతే తన నిర్ణయం చెబుతానని బాలయ్య తేల్చేశాడు.కానీ ఇప్పటివరకు తన నిర్ణయాన్ని మాత్రం చెప్పలేదు.

ఇరకాటంలో పెట్టిన బాలయ్య.. ఎవరినో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో బాలయ్య అంగీకారం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి బాలయ్య ఈ సినిమాకు ఓకే చెబుతాడా లేక నో చెబుతాడా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test