బాలయ్య వల్ల ఆ పెళ్లిలు ఆగాయా?     2015-05-09   01:04:32  IST  Raghu V

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతారు. సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలు పెట్టే దగ్గర నుండి గుమ్మడి కాయ కొట్టి, విడుదల వరకు కూడా మంచి రోజులు చూసి చేస్తూ ఉంటారు. ఇక ఒక హీరో సినిమా సక్సెస్‌ అయినా, ఫెయిల్‌ అయినా కూడా దానికి సెంటిమెంట్లు వెదుకుతూ ఉంటారు. తాజాగా టాలీవుడ్‌లో ఒక వింత సెంటిమెంట్‌ ప్రచారం జరుగుతోంది. నందమూరి హీరో బాలకృష్ణతో పెళ్లి కుదిరిన తర్వాత నటిస్తే ఆ పెళ్లి క్యాన్సిల్‌ అవుతుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నారు. అందుకు రెండు ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు.

గతంలో బాలకృష్ణ నటించిన ‘శ్రీరామ రాజ్యం’ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రారంభంకు ముందే నయన తార పెళ్లి ప్రభుదేవాతో ఫిక్స్‌ అయ్యింది. ఆయన కూడా నయన్‌ను పెళ్లి చేసుకునేందుకు తన భార్య రమాలత్‌కు విడాకులు కూడా ఇచ్చాడు. అయితే ‘శ్రీరామ రాజ్యం’ విడుదల తర్వాత వీరి పెళ్లి జరగాల్సి ఉంది. కాని ఆ పెళ్లి పెటాకులు అయ్యింది. తాజాగా బాలయ్య ‘లయన్‌’ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా తర్వాత త్రిష పెళ్లి చేసుకోవాల్సి ఉంది. నిశ్చితార్థం కూడా పూర్తి అయిన తర్వాత త్రిష పెళ్లి పెటాకులు అయ్యింది. దాంతో ఇప్పుడు అంతా కూడా బాలయ్యతో సినిమా చేస్తే పెళ్లి క్యాన్సిల్‌ అవుతుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి చెత్త సెంటిమెంట్లను పుట్టించవద్దని నందమూరి ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.