ఆ విషయం శ్రీహరికి ముందే చెప్పానంటున్న బాలయ్య..?  

balakrishna interesting comments about hero srihari Sri Hari, Balakrishna, Dharma Kshetram, Narthana Shala, Srihari Bheemudu Chracter, Sharath Babu, Saundarya - Telugu Balakrishna, Balakrishna Interesting Comments About Hero Srihari, Dharma Kshetram, Narthana Shala, Saundarya, Sharath Babu, Sri Hari, Srihari Bheemudu Chracter

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా అన్ని రకాల పాత్రలను పోషించి మెప్పించిన నటుడు శ్రీహరి.స్టంట్ మాస్టర్ గా సినిమా ఇండస్ట్రీలో కెరీర్ మొదలుపెట్టిన శ్రీహరి ధర్మక్షేత్రం అనే సినిమాతో తన నటప్రస్థానాన్ని ప్రారంభించారు.

TeluguStop.com - Balakrishna Interesting Comments About Hero Srihari

ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించారు.నువ్వొస్తానంటే నేనొద్దాంటనా, కింగ్, మగధీర, బృందావనం సినిమాల్లోని పాత్రలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

నటుడిగా వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలో లివర్ సంబంధిత వ్యాధి వల్ల 2013 సంవత్సరం అక్టోబర్ 9న శ్రీహరి కన్నుమూశారు.2004 సంవత్సరంలో బాలకృష్ణ అర్జునుడిగా శ్రీహరి భీముడిగా సౌందర్య ద్రౌపదిగా నటించిన నర్తనశాల సినిమా సౌందర్య మరణం వల్ల ఆగిపోయింది.తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ఫుటేజీని ఎడిటింగ్ చేసి శ్రేయాస్ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్ లో బాలకృష్ణ విడుదల చేశారు.

TeluguStop.com - ఆ విషయం శ్రీహరికి ముందే చెప్పానంటున్న బాలయ్య..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నర్తనశాల ప్రమోషన్ల సందర్భంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న బాలయ్య శ్రీహరి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శ్రీహరికి ప్రతిభతో పాటు ఫిజిక్ ఉందని అందువల్లే ఆ సినిమాలో భీముని పాత్రకు ఎంపిక చేసుకున్నానని తెలిపారు.తనకు ఉన్న స్నేహితుల్లో శ్రీహరి ఒకరని.శ్రీహరి తనలా మనసులో ఏ విషయాన్ని దాచుకోరని.శ్రీహరికి రాణా సినిమాలో కేశవ పాత్రలో నటిస్తే మంచిపేరు వస్తుందని ముందే చెప్పానని.

చివరకు ఆ మాటే నిజమైందని ఆ పాత్రతో శ్రీహరికి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టిందని తెలిపారు.

శ్రీహరి తనకు బాలకృష్ణ అవకాశం ఇచ్చి సహాయం చేశాడని అందరికీ చెప్పేవాడని.

ఆ విషయం ఇతరుల ద్వారా తనకు తెలిసిందని బాలకృష్ణ అన్నారు. శ్రీహరి ఇతరులతో చాలా మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారని బాలయ్య తెలిపారు.

ఫోన్ చేసి పాత్ర గురించి చెప్పగానే శ్రీహరి వెంటనే సినిమాలో నటించడానికి అంగీకరించాడని చెప్పారు.

#Narthana Shala #Dharma Kshetram #SrihariBheemudu #Sri Hari #Sharath Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Balakrishna Interesting Comments About Hero Srihari Related Telugu News,Photos/Pics,Images..