పుష్ప లో బాలయ్య వార్తలపై సుకుమార్‌ ఏమన్నాడంటే..!

Balakrishna In Allu Arjun Sukumar Pushpa Part 2 Movie

అల్లు అర్జున్‌ పుష్ప సినిమా తో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాడు.బాలీవుడ్‌ లో 80 కోట్ల వసూళ్లు దక్కించుకుని బాహుబలి తర్వాత స్థానంను దక్కించుకున్నాడు.

 Balakrishna In Allu Arjun Sukumar Pushpa Part 2 Movie-TeluguStop.com

కేజీఎఫ్ స్థాయిలో ఉంటుందని అంతా అనుకుంటే ఆ సినిమాకు రెట్టింపు స్థాయిలో పుష్ప నిలిచింది అంటూ వసూళ్లు నిరూపించాయి.రికార్డు బ్రేకింగ్ వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా మరింత భారీ వసూళ్లను దక్కించుకోవడం కోసం పుష్ప 2 తో రాబోతున్న విషయం తెల్సిందే.

పుష్ప 2 సినిమా మొదటి పార్ట్‌ కంటే రెట్టింపు యాక్షన్ తో ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.బాలయ్య మరియు అల్లు అర్జున్‌ లు పుష్ప 2 లో కనిపిస్తారనే వార్తలు ఈమద్య జోరుగా వస్తున్నాయి.

 Balakrishna In Allu Arjun Sukumar Pushpa Part 2 Movie-పుష్ప లో బాలయ్య వార్తలపై సుకుమార్‌ ఏమన్నాడంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలయ్య అన్‌ స్టాపబుల్‌ లో బన్నీ మరియు సుక్కు లు పాల్గొన్నారు.ఆ సమయంలో చాలా మంది పుష్ప 2 లో బాలయ్య ను నటింపజేయవచ్చు కదా అంటూ సుకుమార్‌ ను అడిగారట.

బాలయ్య కూడా సుక్క తో కలిసి వర్క్‌ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు.

కనుక ఖచ్చితంగా వీరి కాంబోలో సినిమా ఉండాలి.

అది పుష్ప 2 అయితే బాగుంటుంది అంటూ చాలా మంది అనుకున్నారు.పుష్ప 2 లో బాలయ్య నటిస్తున్నట్లుగా అలా వార్తలు మొదలు అయ్యాయి.

కాని సుకుమార్‌ తాజాగా ఆ విషయమై స్పందించాడు.పుష్ప పార్ట్‌ 1 లో ఉన్న వారు మాత్రమే పార్ట్‌ 2 లో ఉంటారు.

కొత్త వారికి ఛాన్స్ లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఆ వ్యాఖ్యల తో పుష్ప 2 లో బాలయ్య వార్తలపై క్లారిటీ వచ్చినట్లయింది.పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్ప 2 ను భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఏడాది డిసెంబర్‌ లో సినిమా ను విడుదల చేస్తారు.

రెట్టింపు ఉత్సాహంతో సుకుమార్‌ పార్ట్ 2 ను మొదలు పెట్టబోతున్నాడు, రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.పార్ట్‌ 2 లో కూడా ఆమె ఉంటుంది.

Balakrishna In Allu Arjun Sukumar Pushpa Part 2 Movie , Balakrishna, Allu Arjun , Pushpa , Part 2 , Sukumar , Rashmika Mandana - Telugu Allu Arjun, Balakrishna, Pushpa, Sukumar

#Pushpa #Allu Arjun #Sukumar #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube