ఎన్టీఆర్‌పై బాలయ్య పరోక్ష విమర్శలు

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్‌’ చిత్రం ఈనెల 14న సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ సందర్బంగా చిత్ర ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ను నిర్వహించారు.

 Balakrishna Imdirect Comments On Ntr-TeluguStop.com

ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.ఆ మధ్య ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఆడియో వేడుక సందర్బంగా నందమూరి బాలకృష్ణ వారసుడు ఎన్టీఆర్‌ అంటూ హరికృష్ణ చెప్పిన విషయం తెల్సిందే.

ఆ విషయంపై చర్చ జరుగుతున్న సమయంలోనే నాకు నేనే పోటీ, నాకు ఎవరు పోటీ లేరు, సాటి రారు అంటూ బాలకృష్ణ సంచలన ప్రకటన చేశాడు.

ఎన్టీఆర్‌ క్రేజ్‌ గురించి, నందమూరి హీరోల్లో ఎన్టీఆర్‌ నెం.1 అంటూ ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేయడంతో అంతా కూడా ఎన్టీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా బాలయ్య ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.మొత్తానికి బాలయ్య ఎన్టీఆర్‌ల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.

అయితే మరో వైపు మాత్రం తాజాగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.తనకు బాబాయితో ఎలాంటి శత్రుత్వం లేదు అని, ఆయనతో పోటీ పడే స్థాయి తనకు లేదు అని, తాను నెం.1 కాదు అని, లాగే తాతగారికి తాను ఎప్పటికి వారసుడిని కాదు అని, ఆయన మనవడిగా ఈ గుర్తింపు చాలు అని ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube