చిరంజీవి, వెంకటేష్ లకు భారీ షాకిచ్చిన బాలయ్య మూవీ ఏదో తెలుసా?

ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు పెద్ద హీరోల సినిమాలు రిలీజవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ ఏడాది కరోనా వల్ల సంక్రాంతికి క్రాక్ మినహా మరే పెద్ద సినిమా రిలీజ్ కాకపోయినా వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.20 సంవత్సరాల క్రితం 2001 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా జనవరి నెల 11వ తేదీన బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు సినిమా విడుదలైంది.

 Balakrishna Huge Shock To Chiranjeevi Venkatesh In 2001 Sankranti Season-TeluguStop.com

బాలకృష్ణ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో నరసింహ నాయుడు ఒకటి.

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపుగా 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్యకు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టిన సినిమాలలో ఒకటి.

 Balakrishna Huge Shock To Chiranjeevi Venkatesh In 2001 Sankranti Season-చిరంజీవి, వెంకటేష్ లకు భారీ షాకిచ్చిన బాలయ్య మూవీ ఏదో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికీ టీవీలలో నరసింహ నాయుడు సినిమాకు ఆదరణ బాగానే దక్కుతోంది.అయితే నరసింహ నాయుడు సినిమా రిలీజైన రోజునే చిరంజీవి నటించిన మృగరాజు సినిమా కూడా రిలీజైంది.

Telugu 2001 Sankranti Movies, 30 Crores Gross Collections, Balakrishna, Chiranjeevi, Devi Putrudu, Mrugaraju, Narasimha Naidu, Tollywood-Movie

గుణశేఖర్ దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కి భారీ అంచనాలతో విడుదలైన మృగరాజు సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది.2001 సంవత్సరంలో నరసింహ నాయుడు సినిమా హైయెస్ట్ కలెక్షన్లు సాధించగా మృగరాజు రిజల్ట్ తో చిరంజీవికి నిరాశ తప్పలేదు.నరసింహ నాయుడు రిలీజైన మూడు రోజుల తర్వాత కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా నటించిన దేవీ పుత్రుడు సినిమా విడుదలైంది.

Telugu 2001 Sankranti Movies, 30 Crores Gross Collections, Balakrishna, Chiranjeevi, Devi Putrudu, Mrugaraju, Narasimha Naidu, Tollywood-Movie

దేవీ పుత్రుడు సినిమాకు కూడా ఫ్లాప్ టాక్ రావడంతో ఆ సినిమా నిర్మాత ఎం.ఎస్ రాజుకు భారీ నష్టాలు తప్పలేదు.ఒక విధంగా బాలయ్య నరసింహ నాయుడు సినిమాతో చిరంజీవి, వెంకటేష్ లకు భారీ షాక్ ఇచ్చారనే చెప్పాలి.

#Devi Putrudu #Sankranti #Chiranjeevi #Gross #Mrugaraju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు