అవతలి వ్యక్తికి ధైర్యం ఉండాలి.. మెగాస్టార్ తో మల్టీ స్టారర్ పై బాలయ్య హింట్?

మామూలుగా ఒక సినిమాకు ఒక హీరో ఉంటే అందులో కొత్త ఏమీ ఉండదు.ఎందుకంటే ఒక సినిమాకు ఒక హీరో ఉండటం మాత్రం గ్యారెంటీ.

 Balakrishna Hint On Chiranjeevi Multistarrer Movie Details,  Balakrishna, Chiran-TeluguStop.com

సినిమా అంటేనే ఒక హీరో, ఒక హీరోయిన్.అదే సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే సినిమా క్రేజీగా ఉంటుంది.

పైగా ప్రేక్షకులు కూడా సినిమా చూడటానికి ఇష్టపడుతుంటారు.ఒకవేళ ఇద్దరు హీరోలు స్టార్ హీరోలు అయితే మాత్రం ఆ సినిమాకు వచ్చే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.

ఎందుకంటే స్టార్ హీరోల కాంబినేషన్ లో సినిమా ఉన్నట్లయితే సినిమా కథ గాని, ఆ హీరోల పాత్రలు గాని బాగా ఆసక్తిగా ఉంటాయి.దీంతో సినిమా పై మరింత హైప్ పెరుగుతుంది.

ఇప్పటికే మల్టీస్టారర్ గా చాలా సినిమాలు తెరకెక్కాయి.మంచి సక్సెస్ లు కూడా అందుకున్నాయి.

అప్పట్లో కూడా స్టార్ హీరోల కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి.

కానీ కొంత కాలం తర్వాత మల్టీ స్టారర్ గా ఏ సినిమా కూడా రాలేదు.

కానీ ఈ మధ్య మళ్ళీ దర్శకులు, నటీనటులే కాకుండా ప్రేక్షకులు కూడా మల్టీ స్టార్ ల కాంబినేషన్ లలో సినిమా చూడాలని ఆశపడుతున్నారు.దాంతో దర్శకులు కూడా ప్రేక్షకుల కోరికలను కాదనకుండా స్టార్ హీరోల కాంబినేషన్ లో సినిమాలు చేస్తున్నారు.

Telugu Akhanda, Balakrishna, Balayyachiru, Chiranjeevi, Multirer, Multriar, Myth

ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.దీంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి భారీ అంచనాలు కూడా వస్తున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా నందమూరి బాలయ్య కూడా మల్టీ స్టారర్ కాంబినేషన్ లో ఒక హింట్ ఇచ్చాడు.ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Telugu Akhanda, Balakrishna, Balayyachiru, Chiranjeevi, Multirer, Multriar, Myth

ఇక ఇటీవల అఖండ సినిమాతో కూడా కెరీర్ పరంగా బెస్ట్ సక్సెస్ సొంతం చేసుకున్నాడు.ఈ సినిమా సక్సెస్ తర్వాత బాలయ్య విజయవాడలో అమ్మవారిని దర్శించుకున్నాడు.దీంతో ఆయన తాజాగా కొన్ని విషయాలు పంచుకున్నాడు.తనకు ఈ సినిమా సక్సెస్ అందుకోవటంతో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Telugu Akhanda, Balakrishna, Balayyachiru, Chiranjeevi, Multirer, Multriar, Myth

ఇక తను మంచి కథ దొరికితే మల్టీస్టారర్ గా మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.తన కాంబినేషన్ లో నటించాలంటే అవతలి వ్యక్తికి ధైర్యం ఉంటే తాను సిద్ధమే అని తెలిపాడు.ఇక ఓవైపు చిరంజీవి, బాలయ్య కాంబినేషన్ గురించి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వాళ్లు ఓ సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

దీంతో బాలయ్య ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తాను మల్టీస్టారర్ గా నటించడానికి ఓకే అని చెప్పినట్లు అర్థమవుతుంది.

దీనిని బట్టి తను మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించబోతున్నట్లుగా మొత్తానికి ఒక హింట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.మరి బాలయ్య మాటలు వింటే మాత్రం కచ్చితంగా చిరంజీవితో మల్టీస్టారర్ గా ఓ సినిమా ఉండనున్నట్లు అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube