వీసా కోసమే పెళ్లి చేసుకున్నానంటున్న బాలయ్య హీరోయిన్..!  

Radhika Apte does not believe in Marrige, Radhika Apte, Balakrishna, Marriage , Marriage for Visa, Film Industry, Netizens, Radhika Apte Comments on Marriage - Telugu Balakrishna, Bendict Taylor, Film Industry, Marriage, Marriage For Visa, Netizens, Radhika Apte, Radhika Apte Comments On Marriage, Radhika Apte Does Not Believe In Marrige, Radhika Apte Visa

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధికా ఆప్టే.తెలుగులో బాలకృష్ణకు జోడీగా లెజెండ్, లయన్ సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే వివాదాస్పద విషయాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

TeluguStop.com - Balakrishna Heroine Radhika Apte Sensational Comments About Marriage

తాజాగా తన పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసి మరోమారు రాధికా ఆప్టే వార్తల్లో నిలిచింది.వీసా కోసమే పెళ్లి చేసుకున్నానని చెప్పి అభిమానులను అవాక్కయ్యేలా చేసింది.

ఒక ఇంటర్వ్యూలో రాధికా ఆప్టేకు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురు కాగా ఆమె మాట్లాడుతూ తాను విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నానని.2012లో వివాహం జరిగిందని తెలిపారు.తనకు వివాహా బంధంపై పెద్దగా నమ్మకం లేదని వీసా కోసం తాను పెళ్లి చేసుకున్నానని అన్నారు.విదేశాల్లో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంటే సులభంగా వీసా లభిస్తుందని తెలిసి తాను కలిసి జీవించాలని భావించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని తెలిపారు.
తనకు వివాహ వ్యవస్థపై అసలు నమ్మకమే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.బ్రిటన్ దేశానికి చెందిన మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్ ను రాధికా ఆప్టే పెళ్లి చేసుకోగా ఆమె చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguStop.com - వీసా కోసమే పెళ్లి చేసుకున్నానంటున్న బాలయ్య హీరోయిన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వివాహ వ్యవస్థను కించపరిచే విధంగా రాధికా ఆప్టే మాటలు ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
పెళ్లి తర్వాత అవకాశాలు రావడంతో బిజీ అయిన రాధికా ఆప్టే ఇంగ్లీష్ సినిమాల్లో సైతం నటించారు.గతంలో సౌత్ ఇండియాకు చెందిన ఒక స్టార్ హీరో గురించి పేరు చెప్పకుండా రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం సృష్టించాయి.

గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న రాధికా ఆప్టే తాజాగా పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది.

#RadhikaApte #RadhikaApte #Radhika Apte #Netizens #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Balakrishna Heroine Radhika Apte Sensational Comments About Marriage Related Telugu News,Photos/Pics,Images..