చిరు సరసన బాలయ్య హీరోయిన్‌?

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తుండగా తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.ఆగస్టులో చిరు 150వ సినిమా ప్రారంభం కాబోతున్నట్లుగా చరణ్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.

 Chiranjeevi To Romance With Radhika Apte-TeluguStop.com

ఇక ఈ సినిమాకు పూరి జగన్నాధ్‌ దర్శకత్వం వహించబోతున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది.

అయితే ఆ వార్తలను దర్శకుడు పూరి సన్నిహితులు కొట్టి పారేశారు.తాజాగా చిరు సరసన హీరోయిన్‌గా నటించబోతుంది అంటూ మరో హీరోయిన్‌ పేరు ప్రస్తుతం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో జోరుగా సాగుతున్నాయి.

ఆమె మరెవ్వరో కాదు రాధిక ఆప్టే.బాలయ్యతో ‘లెజెండ్‌’, ‘లయన్‌’ సినిమాల్లో నటించిన రాధిక ఆప్టే బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకు పోతుంది.

సీనియర్‌ హరోలకు ఈమె బాగా సూట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో రాధిక ఆప్టేను చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రిపర్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే కొన్ని రోజుల క్రితం రాధిక ఆప్టే న్యూడ్‌ వీడియో వెబ్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసింది.

అటువంటి హీరోయిన్‌ను చిరుకు జోడీగా పెట్టడం సరైన నిర్ణయం కాదు అని కొందరు అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి కొందరు మాత్రం ఏం పర్వాలేదు, చిరుకు సరైన జోడీ రాధిక ఆప్టే అని, సెంటిమెంట్‌గా కూడా చిరుకు రాధిక ఆప్టే కలిసి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube