వెంకీ అట్లూరి కథ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ ఈ మధ్య సినిమాల విషయంలో కాస్త స్పీడ్ పెంచారు.ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ మూవీలో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Balakrishna Green Signal To Venky Atluri Story, Tollywood, Akhanda Movie, Gopich-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా అఖండ తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీ ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ మూవీలో యాక్షన్ తో పాటు కామెడీ కూడా కావలసినంత ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

Telugu Akhanda, Anil Ravipudi, Balakrishna, Tollywood, Venky Atluri-Movie

తాజాగా మరో న్యూస్ టాలీవుడ్లో చక్కెర్లు కొడుతుంది.నితిన్ కి రంగ్ దేతో ఫ్లాప్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో బాలయ్య బాబు చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం.ఈ మూవీ కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

తొలిప్రేమతో సక్సెస్ అందుకొని తరువాత మిస్టర్ మజ్ఞు, రంగ్ దే సినిమాలతో వరుసగా రెండు ఫ్లాప్ లని వెంకీ అట్లూరి తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపధ్యంలో ఆ యంగ్ డైరెక్టర్ తో బాలకృష్ణ సినిమా అనేసరికి ఫ్యాన్స్ కి టెన్షన్ మొదలైంది.

బాలకృష్ణ సినిమా అంటేనే భారీ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు.మరి వెంకీ అట్లూరి ఆ స్థాయిలో ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచే విధంగా బాలయ్య బాబు కోసం కథను సిద్ధం చేశాడా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube