అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్‌కు బాలయ్య రెండో ఛాన్స్..?  

Balakrishna Gives Second Chance To Sriwass, Balakrishna, Sriwass, Dictator, Boyapati Sreenu, Tollywood News - Telugu Balakrishna, Boyapati Sreenu, Dictator, Sriwass, Tollywood News

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మాస్ ప్రేక్షకులతో పాటు అభిమానుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

TeluguStop.com - Balakrishna Gives Second Chance To Sriwass

కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకముందే బాలయ్య తన నెక్ట్స్ చిత్రం కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్‌తో బాలయ్య ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.అతి త్వరలో ఈ ప్రాజెక్టును అఫీషియల్‌గా లాంఛ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట.కాగా ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడట.

TeluguStop.com - అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్‌కు బాలయ్య రెండో ఛాన్స్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గతంలో డిక్టేటర్ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీవాస్, బాలయ్య కోసం మరో పవర్‌ఫుల్ సబ్జెక్టును రెడీ చేశాడట.ఇప్పటికే ఈ కథకు సంబంధించిన స్టోరీలైన్‌ను విన్న బాలయ్య, ఈ సినిమాకు ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది.

గతంలో తెరకెక్కిన డిక్టేటర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచినా, ప్రేక్షకులు ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు.దీంతో మరోసారి శ్రీవాస్‌కు అవకాశం ఇవ్వాలని బాలయ్య ఆలోచించాడని, అందుకే ఇప్పుడు ఆయనతో మరో ప్రాజెక్టు చేసేందుకు రెడీ అయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.ఇక బోయపాటితో చేస్తున్న చిత్రంతో మరోసారి బాక్సాఫీస్‌పై తన సత్తా చాటాలని బాలయ్య రెడీ అవుతున్నాడు.

#Boyapati Sreenu #Sriwass #Dictator #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు