సంక్రాంతికి `గా వచ్చి సందడి చేస్తున్న బాలయ్య బాబు తన నెక్స్ట్ సినిమా అనీల్ రావిపుడి డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.అనీల్ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టుకున్నారు బాలకృష్ణ అనీల్ తర్వాత బింబిసార డైరెక్టర్ వశిష్టతో బాలయ్య సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు.
బింబిసార చూసినప్పుడే వశిష్టకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఇదే కాకుండా బోయపాటి శ్రీనుతో మరోసారి బాలయ్య సినిమా ఉంటుందని తెలుస్తుంది.అఖండ 2 గా ఒక ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉంది.ఇదేకాదు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కూడా బాలకృష్ణ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
బాలయ్య దూకుడు చూసి యువ హీరోలు కూడా షాక్ అవుతున్నారు.వీర సింహా రెడ్డితో ఫ్యాన్స్ ను మెప్పించిన బాలకృష్ణ.
సినిమాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు.రాబోయే సినిమాలా కాంబినేషన్స్ అన్ని అదిరిపోతుండగా తప్పకుండా బాలయ్య బాక్సాఫీస్ పై మరోసారి సునామి సృష్టిస్తాడని చెప్పొచ్చు.
ఓ పక్క ఆహా అన్ స్టాపబుల్ షోతో కూడా డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా బాలకృష్ణ దుమ్ముదులిపేస్తున్నారు.