ఆ సెంటిమెంట్ నే నమ్ముకున్న బాలకృష్ణ.. హిట్టొస్తుందా..?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే బ్లాక్ బస్టర్ హిట్ అని అటు బాలయ్య ఫ్యాన్స్, ఇటు బోయపాటి శ్రీను ఫ్యాన్స్ భావిస్తారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

 Balakrishna Following His Sentiment For His Next Movie, Bb3, M Sentiment, Balay-TeluguStop.com

ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా మే 28వ తేదీన విడుదల కానుంది.

అయితే బాలయ్య బోయపాటి శ్రీను సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ లో కూడా సినిమా టైటిల్ ను ప్రకటించలేదు.

అయితే మొదటి నుంచి వినిపిస్తున్న మోనార్క్ పేరునే ఈ సినిమాకు ఫైనల్ చేశారని ఈ పేరును ఫైనల్ చేయడానికి బాలయ్య సెంటిమెంట్ కూడా కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య సినీ కెరీర్ లో “ఎం” సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమాలన్నీ హిట్ అయ్యాయని.

అందువల్ల ఈ సినిమాకు కూడా మోనార్క్ టైటిల్ నే ఫిక్స్ చేయాలని బాలయ్య భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Telugu Balakrishna, Balayya, Blockbuster, Boyapati Sreenu, Boyapati Srinu, Monar

బాలకృష్ణ హీరోగా ఎం సెంటెమెంట్ తో తెరకెక్కిన మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, మువ్వ గోపాలుడు, ముద్దుల కృష్ణయ్య లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.అయితే ఎం సెంటిమెంట్ తో తెరకెక్కిన ముద్దుల మొగుడు, మిత్రుడు, మాతో పెట్టుకోకు, ముద్దుల మేనల్లుడు లాంటి ఫ్లాపులు కూడా ఉన్నాయి.అయితే ఎమ్ సెంటిమెంట్ తో హిట్టైన సినిమాలన్నీ మంచిపేరు తెచ్చిపెట్టడంతో బాలయ్య ఈ టైటిల్ కే ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా కావడంతో ఎం అనే అక్షరంతో మొదలయ్యే మోనార్క్ నే టైటిల్ గా ఫిక్స్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని బాలకృష్ణకు ఎం సెంటిమెంట్ హిట్ ఇస్తుందేమో చూడాల్సి ఉంది.

త్వరలో ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube