బాలయ్య లైన్‌ లో పెట్టిన అయిదు సినిమాలు ఏంటో తెలుసా?

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ఒక వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్నాడు.ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

 Balakrishna Five Movies Next Two Years , Balakrishna, Assembly Elections, Anil R-TeluguStop.com

వచ్చే ఎడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.ఆ అసెంబ్లీ ఎన్నికల( Assembly elections ) కోసం బాలయ్య సినిమాలకు కాస్త బ్రేక్‌ తీసుకునే యోచనలో ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu-Movie

కానీ అసలు విషయం ఏంటి అంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు సినిమాలను రాబోయే ఏడాది రెండేళ్ల కాలంలో చేసేందుకు గాను బాలయ్య ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య దాదాపు అన్ని కథలకు ఓకే చెప్పాడు.ఆయన డేట్లు ఇస్తే సినిమా లను మొదలు పెట్టేందుకు దర్శకులు సిద్ధంగా ఉన్నారట.ప్రస్తుతం అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో ఒక సినిమాను బాలయ్య చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు మరో నెల రెండు నెలల్లో ముగించే అవకాశాలు ఉన్నాయి.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu-Movie

ఇక బాలయ్య తన తదుపరి సినిమా ను బోయపాటి శ్రీను( Boyapati Srinu ) దర్శకత్వంలో చేయాలని భావిస్తున్నాడు.అయితే స్క్రిప్ట్‌ విషయం లో కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.కనుక ఈ లోపు గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) దర్శకత్వంలో మరో సినిమాను బాలయ్య చేస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

పూరి జగన్నాధ్ కు ఇప్పటికే ఒకే చెప్పిన బాలయ్య త్వరలోనే ఆయన సినిమాను మొదలు పెట్టే అవకాశాలు లేకపోలేదు.హీరోగా బాలయ్య చేస్తున్న సినిమాలతో పోల్చితే ఇతర హీరోల సినిమాలు చాలా తక్కువ అంటూ దీన్ని బట్టి అర్థం అవుతుంది.

బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో ఆదిత్య 999 ( Aditya 99 )సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే.ఇవన్నీ కాకుండా ఇప్పుడు బాలయ్య బలగం చిత్ర దర్శకుడు వేణు దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్ధం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube