సౌందర్య మరణంతో ఆగిపోయిన బాలకృష్ణ సినిమా.. ఏదో తెలుసా?

అలనాటి అందాల తార సౌందర్య.టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సౌందర్య ఏ సినిమా అయినా ఎలాంటి పాత్రలో అయినా అద్భుతంగా నటించగలదు.

 Soundarya Balakrishna Movie Nartanasala Movie Halted, Balakrishna Film, Nartanas-TeluguStop.com

మోడరన్ అయినా ట్రెడిషనల్ అయినా.హీరోయిన్ పాత్ర అయినా.

విలన్ పాత్ర అయినా.ఏదైనా సరే పాత్రలో నటించమంటే జీవించేసింది.

అందుకే సౌందర్య సినిమాల్లో ఎటువంటి ఎక్సపోసింగ్ లేకపోయినప్పటికి ఆమె సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచేసేవారు.
అలాంటి అందాల తార సౌందర్య ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఆమెకు అవే చివరి క్షణాలు అయ్యాయి.

ఏప్రిల్ 17, 2004లో ఆమె మరణించారు.ఆమె మరణం విన్న సౌత్ ఇండియా ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది.

సౌందర్య మరణాన్ని టాలీవుడ్ ప్రేక్షకులు, సినీ పెద్దలు జీర్ణించుకోలేకపోయారు.ఎందుకంటే ఆమె లేనిదే ఇండస్ట్రీని ఊహించుకోలేకపోయారు.

ఏ పెద్ద సినిమా వచ్చిన ఆమె పాత్ర ఉండేలా ఎంతోమంది ప్లాన్ చేసుకునేవారు.

ఇక అలానే పౌరాణిక సినిమాను ”నర్తనశాల’‘ సినిమా పేరుతో మొదలు పెట్టాడు బాలయ్య బాబు.

అయితే ఆ సినిమాను సౌందర్య మరణంతో ఆపేయాల్సి వచ్చింది.ఎందుకంటే ఆ సినిమాలో సౌందర్యకు ద్రౌపది పాత్ర ఇచ్చారు.

ఆమె మరణించడంతో ద్రౌపది పాత్రలో మరో నటిని ఊహించడం చాలా కష్టం అని భావించింది చిత్ర బృందం.

దీంతో ఆ సినిమాను తియ్యడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు మధ్యలోనే ఆగిపోయింది.

అయితే ఈ విషయంపైనా బాలయ్యను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగితే సౌందర్య లాంటి అద్భుతమైన నటి కనిపిస్తే ఆ సినిమా కచ్చితంగా పూర్తి చేస్తానని బాలకృష్ణ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.ఏది ఏమైనా ఒక హీరోయిన్ కోసం భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆపేశారంటేనే అర్ధం చేసుకోవాలి సౌందర్య ఎంత గొప్ప నటి అనేది.

టాలీవుడ్ లో ఇప్పటికి ఆమెలేని లోటు కనిపిస్తుంటుంది!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube